సామూహిక అక్షరాభ్యాసాలు.. కిటకిటలాడిన దేవాలయాలు

సామూహిక అక్షరాభ్యాసాలు.. కిటకిటలాడిన దేవాలయాలు

వసంత పంచమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో   సామూహిక అక్షరాభ్యాసాలు జరిగాయి.  ఈ రోజు ( ఫిబ్రవరి 3 ) తెల్లవారు జామునుంచే ఆలయాలు కిటకిటలాడాయి.  చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహించారు.  బాసర లాంటి పుణ్యక్షేత్రాల్లో భక్తులు సరస్వతిదేవి అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.

తెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దాదాపు ప్రతి దేవాలయంలోనే సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.  చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య సరస్వతీ మాత పూజ నిర్వహించి చిన్నారులకు అక్షరాలు దిద్దించారు. 

చదువుల తల్లి సరస్వతి కొలువైన బాసర క్షేత్రం లక్షలాది  భక్తులతో  కిక్కిరిసిపోయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడుల నుంచి పెద్ద సంఖ్యలో  భక్తులు తరలివచ్చారు. బాసరలో అక్షరాభ్యాసం చేస్తే  చదువుల తల్లి కరుణిస్తుందనే నమ్మకంతో  ఎక్కడెక్కడి నుంచో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

ALSO READ | తిరుమల అప్​ డేట్​: శ్రీవారి మినీ బ్రహ్మోత్సవం.. ఒకే రోజు ఏడు వాహనాలపై మలయప్ప స్వామి దర్శనం.. ఎప్పుడంటే..

తెల్లవారుజామున నాలుగు గంటలకు అమ్మవారి దర్శనానికి అనుమతించారు.గోదావరిలో పుణ్యస్నానాలతో రద్దీగా మారింది. అమ్మవారి దర్శనంతో పాటు అక్షరాభ్యాసాల కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు.  భక్తుల రద్దీ మరింత పెరగడంతో..  రైల్వేస్టేషన్‌కు  సమీపంలోనే వాహనాలను నిలిపి వేస్తుండడంతో భక్తులు కాలినడకన వెళ్లాల్సి వచ్చింది. ఆలయానికి చేరుకోడానికి  భక్తులు ఇబ్బందులు పడ్డాకె.. చంటి పిల్లలతో వచచిన వారు,  వృద్ధులు కాలినడకన వెళ్లడం ఇబ్బందిగా మారింది.