ఫిబ్రవరి 3 వసంత పంచమి.. సరస్వతి దేవికి సమర్పించాల్సిన నైవేద్యాలు ఇవే..

ఫిబ్రవరి 3 వసంత పంచమి.. సరస్వతి దేవికి సమర్పించాల్సిన నైవేద్యాలు ఇవే..

మాఘ మాసంలో శుక్లపక్షం పంచమి తిథి నాడు వసంత పంచమి పండుగను నిర్వహించుకుంటారు. ఆరోజున పిల్లలు అందరూ సరస్వతి దేవిని పూజిస్తారు.  చదువుల తల్లి .. సరస్వతి దేవి అనుగ్రహం విద్యలో ఉన్నత శిఖరాలను చేరుకుంటారని పండితులు చెబుతుంటారు.సరస్వతి దేవి అమ్మవారికి కొన్ని రకాలు పదార్ధాలను నైవేద్యంగా సమర్పిస్తే ప్రసన్నరాలవుతుందని పండితులు చెబుతున్నారు.  ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . .

సరస్వతి దేవి ఙ్ఞాన దేవత..   బ్రహ్మదేవుని భార్య .. సరస్వతిదేవి మాఘమాసం... శుద్ద పంచమి తిథి రోజున జన్మించిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ ఏడాది సరస్వతిదేవి పుట్టిన రోజు ఫిబ్రవరి 3 వ తేది వచ్చింది.  అందుకే ఆరోజున చాలామంది చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. 

ALSO READ | పండ్లు, కూరగాయలను అలాగే తినాలి.. జ్యూస్​లు చేసి తాగొద్దు..

వసంత పంచమి రోజున పొద్దున్నే లేచి కాల కృత్యాల అనంతరం శుచిగా స్నానం చేసి సరస్వతి దేవిని పూజించాలి.  అమ్మవారికి పసుపు.. కుంకుమ .. గంధం.. పుష్పాలు సమర్పించి పూజలు చేయాలి.  ఆ రోజున సరస్వతీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి పసుపు రంగు వస్తువులను సమర్పించాలి. షోడశోపచారాల పూజ అనంతరం సరస్వతిదేవిని అష్టోత్తర శతనామావళితో పూజించి..ధూపం.. దీపం.. నైవేద్యం హారతి ఇవ్వాలి.  

  • అమ్మవారికి మధురమైన ( స్వీట్​) పదార్దాలు అంటే చాలా ఇష్టం.. రవ్వకేసరి తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి చిన్నారులకు పంచిపెడితే విద్యలో రాణిస్తారని పురాణాలు చెబుతున్నాయి.
  • శెనగపిండితో తయారు చేసిన స్వీట్లు... లడ్డూలను సరస్వతిదేవికి సమర్పించాలి. 
  • కుంకుమపువ్వు.. బియ్యపుపిండి కలిపి పాయసాన్ని తయారు చేసి అమ్మవారికి సమర్పించాలరు. 
  • బియ్యం పిండి, కుంకుమ పువ్వును కలిపి పాయసంతా వండి పెడితే సరస్వతి దేవి ప్రసన్నురాలు అవుతుంది. ఆ తర్వాత ప్రసాదం పంపిణీ చేయాలి.
  •  బియ్యం, బెల్లం, కుంకుమపువ్వు కలిపి వండి నైవేద్యంగా సమర్పించండి.
  • బియ్యం.. బెల్లం.. పాలతో పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి.