భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం

భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం

కాశీబుగ్గ, వెలుగు: భద్రకాళి అమ్మవారి దేవాలయంలో వసంత నవరాత్రి మహోత్సవాలను ఆదివారం వరంగల్​ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్​ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం అమ్మవారికి పూర్ణాభిషేకం నిర్వహించి, లక్ష ఎర్ర గులాబీలతో పుష్పార్చన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చరిత్ర కలిగిన భద్రకాళి అమ్మవారి దేవాలయంలో వసంత నవరాత్రి ఉత్సహాలకు తగు ఏర్పాట్లను చేశామన్నారు. 

ఉగాది పండుగ నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు. ఉత్సవాల సందర్భంగా మంత్రి కొండా సురేఖ అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, ఈవో శేషు భారతి, కార్పొరేటర్​ విజయలక్ష్మి, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.