
భద్రాచలం, వెలుగు : భద్రాచల ఆలయంలో శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం వసంతోత్సవం వైభవంగా జరిగింది. కల్యాణ సీతారామయ్య వసంతం ఆడి భక్తులను మంత్రముగ్ధులను చేశారు. ధ్వజారోహణం అనంతరం 8వ రోజు ఈ వేడుక నిర్వహిస్తారు.
ఉదయం యాగశాలలో చతుస్థానార్చన, హోమాన్ని ప్రధానార్చకులు, వేదపండితుల భక్తి ప్రవత్తులతో నిర్వహించారు. అనంతరం సూర్యప్రభ వాహనంపై ఉత్సవమూర్తులను తాతగుడి సెంటర్ వరకు ఊరేగింపుగా తీసుకెళ్లి.. అక్కడ గోవిందరాజస్వామి ఆలయం చుట్టూ గిరిప్రదక్షిణ చేశారు.శనివారంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.