భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : సింగరేణిలోని బొగ్గు బాయిలు 2030నాటికి మూతపడే అవకాశం ఉందని సింగరేణి కాలరీస్ వర్కర్స్యూనియన్అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్అన్నారు. బొగ్గు బ్లాకుల వేలాన్ని నిరసిస్తూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్ఎదుట యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలను వారు శుక్రవారం ప్రారంభించారు.
వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని బొగ్గు బ్లాక్లను కేంద్ర ప్రభుత్వం సింగరేణికి నామినేషన్పద్ధతిలో ఇవ్వాలన్నారు. కొత్త బొగ్గు బాయిలు రాకపోతే సింగరేణి మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందన్నారు. యూనియన్లీడర్లు వంగా వెంకట్, జి. వీరస్వామి, గట్టయ్య, ఎస్వీ.రమణమూర్తి, క్రిష్టఫర్, శ్రీనివాస్, సురేందర్, రాజేశ్వరరావు, హుమాయన్పాల్గొన్నారు.