కార్మికుల మనుగడను టీబీజీకేఎస్ ​దెబ్బ తీసింది : వాసిరెడ్డి సీతారామయ్య

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి సంస్థతో పాటు కార్మికుల మనుగడను టీబీజీకేఎస్​ దెబ్బతీసిందని సింగరేణి కాలరీస్​ వర్కర్స్​ యూనియన్​ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. కొత్తగూడెం ఏరియాలోని పీవీకే 5 ఇంక్లైన్​తో పాటు పలు డిపార్ట్​మెంట్లలో గురువారం నిర్వహించిన గేట్​ మీటింగ్​లలో ఆయన మాట్లాడారు. కార్మికులకు ఎన్నో రకాల హక్కులను సాధించిన ఘనత ఏఐటీయూసీదేనన్నారు.

సంస్థ సాధించిన లాభాల్లో కార్మికులకు వాటాతో పాటు పెన్షన్​, హెల్త్​ స్కీం సాధించామని తెలిపారు. కార్మికుల పక్షాన పోరాడే సంఘం ఏఐటీయూసీ అని అన్నారు. 27న జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో వర్కర్స్​ యూనియన్​ను గెలిపించాలని కోరారు. ఈ ప్రోగ్రాంలో యూనియన్​ నాయకులు మల్లికార్జునరావు, గట్టయ్య, నాగేశ్వరరావు, రాజేశ్వరరావు, రాంచందర్​, శేషగిరి పాల్గొన్నారు.