Vastu Tips : పూజ గదిలో పెద్దల ఫొటోలు పెట్టుకోవచ్చా.. నష్టం జరుగుతుందా..!

Vastu Tips :  పూజ గదిలో పెద్దల ఫొటోలు పెట్టుకోవచ్చా.. నష్టం జరుగుతుందా..!

ఇల్లు నిర్మించేటప్పుడు కచ్చితంగా వాస్తు నిపుణులను సంప్రదించాలి.  వాస్తు నియమాలను అనుగుణంగా ఇల్లు లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.  ఇంట్లో పూజ గది ప్రత్యేకంగా ఉండాలా.. లేదా గదిలో ఓ మూల దేవుడి మందిరాన్ని ఏర్పాటు  పూజ చేసుకోవచ్చా.. పూజా మందిరంలో ఇంట్లో పెద్దల ఫొటోలను పెట్టుకోవచ్చా.. మొదలగు ప్రశ్నలకు వాస్తు కన్సల్టెంట్​ కాశీనాథుని శ్రీనివాస్​ గారి సలహాలను తెలుసుకుందాం. . .

ప్రశ్న:  ఇంటిని నిర్మించుకొనేటప్పుడు  దేవుడికి ప్రత్యేకంగా గది లేకపోతే అప్పులపాలవుతారని చాలామంది అంటున్నారు. అందుకే పూజ గది కూడా ప్రత్యేకంగా కట్టాలనుకుంటున్నాం. కచ్చితంగా ఈశాన్యంలోనే కట్టాలని కూడా కొంతమంది సూచిస్తున్నారు. అసలు దేవుడి గది ఎలా, ఎక్కడ ఉంటే మంచిది? అలాగే చనిపోయిన మా పెద్దల ఫొటోలను ఆ గదిలో పెట్టుకోవచ్చా? 

జవాబు:  పూజ గది ఎక్కడున్నా దానికి తలుపు ఉండటం అన్నింటికన్నా ముఖ్యమైన విషయం. అది కుదరనప్పుడు కనీసం కర్టెన్​ (పరదా) అయినా అడ్డుగా ఉండాలి. మీకొత్త ఇంట్లోపూజగదిని ఈశాన్యంలో కొందరు పెట్టమంటున్నారని చెప్తున్నారు. కానీ దాన్ని తాను సమర్ధించనని వాస్తు కన్సల్టెంట్​  కాశీనాథుని శ్రీనివాస్​ అంటున్నారు.  ఎందుకంటే ఈశాన్యంలో  బరువు ఉండకూడదు. అక్కడ ఏమీ లేనప్పుడే దేవుడు ఉన్నట్లు లెక్క...  ప్రత్యేకంగా అక్కడ దేవుడి పటాలను పెట్టనక్కర్లేదు. అసలు ఈశాన్యం మూల దీపారాధనలు చేయకూడదు. 

పూజ గదిని నైరుతి మూలన కాకుండా...  పడమర గోడకు పెట్టి....  దేవుడి ముఖం తూర్పుకు ఉండేలా చూసుకోవాలి. లేదా హాల్లో పెట్టుకునేట్లయితే... దేవుడి ముఖం పడమర చూడొచ్చు. చనిపోయిన. పెద్దల ఫొటోలను దేవుడి గదిలో పెట్టుకోవచ్చు. వాళ్లకు పూజ కూడా చేసుకోవచ్చని వాస్తు కన్సల్టెంట్​ కాశీనాథుని శ్రీనివాస్​ అంటున్నారు.