చాలా మందికి సొంతిల్లు ఒక కల. అయితే ఉన్నంతలో ఇల్లు కట్టుకోవాలని అందరూ అనుకుంటారు. అయితే ఒక్కోసారి ఇల్లు మొదలు పెట్టి.. కొన్ని కారణాల వలన మధ్యలోనే ఆపేసే పరిస్థితులు వస్తాయి. కొంతమంది అంచనాకు మించి బడ్జెట్ కావడంతో స్లాబ్ మాత్రమే వేస్తారు.. మళ్లీ ఇంటి నిర్మాణాన్ని ప్రారంభిచాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ ( 9440088799) గారి సలహాలను ఒకసారి చూద్దాం. . .
కొంతమంది ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆగిపోతే ఆశుభంగా భావిస్తారు. కానీ ఇంటి నిర్మాణం ఎప్పుడైనా చేసుకోవచ్చు. మంచిరోజు చూసి పనులను మళ్లీ మొదలుపెట్టొచ్చు. ఆగిపోయిన నిర్మాణం.. కాబట్టి పూజలు చేసి ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు
డైనింగ్ హాల్ ఏ దిక్కులో..
ఇంటి ఫేసింగ్ నార్త్ వైపు ఉంది. ఇంటి ఆగ్నేయం మూలలో డైనింగ్ హాల్ ఉంది..ఇలా ఉంటే వాస్తును ఎలా సరిచేసుకోవాలి.
డైనింగ్ హాల్ కిచెను దగ్గరలో లేదా ముందు ఉండొచ్చు. వాస్తు పరంగా అయితే డైనింగ్ హాల్ దక్షిణ సెంటర్, పడమర సెంటర్ అయితే బాగుంటుంది
ఇల్లు మెయిన్ రోడ్డుకు దగ్గరగా ఉంది.. ఫేసింగ్ దక్షిణం వైపు ఉంది. ఇంటికి ఎదురుగానే మెట్రో రైలు మార్గం ఉంది. దాని వల్ల ఇబ్బందులు ఏమైనా ఉంటాయా?
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి సిటీల్లో వాహనాల రాకపోకల ఎక్కువ. ఇళ్లకు దగ్గరగా రైళ్ల మార్గాలు, రహదారులు ఉండటం చాలా కామన్. దానివల్ల ఇంటికి ఎలాంటి సమస్యలు ఉండవు. భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇంటి ఏరియల్ వ్యూ ఫొటోలు తీసి, మార్కింగ్ చేసి వాస్తు నిపుణులను సంప్రదించండి. మాములుగా అయితే మెట్రోరైలు మార్గానికి, ఇంటి వాస్తుకు ఎలాంటి సంబంధం ఉండదు.
ప్రహరీ కట్టాలా?
ఇల్లు ఫేసింగ్ ఉత్తరం వైపు ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ కు వదిలాం. ఫస్ట్ ఫ్లోర్లో ఇల్లు కట్టుకున్నం. ఆర్ధిక సమస్యల వల్ల ప్రహరీని ఇప్పుడే కట్టుకోవడం లేదు. ప్రహరీని ఎప్పుడైనా కట్టుకోవచ్చా?
ఇది వ్యక్తిగత విషయం. ఇది వాస్తుకు సంబంధించింది. కాదు. ఇంటికి ప్రహరీ ఉన్నా, లేకున్నా వచ్చే నష్టాలేమీ ఉండవు. ప్రహరీ కట్టుకోవడం, కట్టుకోకపోవడం అనేది ఆర్థిక విషయాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రహరీ నిర్మాణం ఎప్పుడైనా చేసుకోవచ్చు. ప్రహరీ ఉంటే ఇంటికి రక్షణ ఉంటుంది. చూసేందుకు బాగుంటుందని ఉండదని వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ ( 9440088799) గారు సూచిస్తున్నారు.
-వెలుగు,లైఫ్