జనాలు సొంత ఇల్లు ఉండాలని అనుకుంటారు. దీనికోసం ఎంతో కష్టపడుతుంటారు. అయితే ఇల్లు నిర్మించేటప్పుడు వాస్తు సిద్దాంతాన్ని అనుసరించాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ప్రస్తుతం హైటెక్ యుగంలో ఇంటి వాస్తుకు సంబందించి తరచు కొన్ని అనుమానాలు.. ప్రశ్నలు వస్తున్నాయి. అలాంటి వాటికి వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్‌గారి (9440088799) సలహాలను ఒకసారి తెలుసుకుందాం.
ప్రశ్న: ఇల్లు కట్టేటప్పుడు భూమి పూజ ఎందుకు చేయాలి? పూజ చేయకుండ ఇల్లు కట్టరా? భూమిపూజకు, వాస్తుకు సంబంధం గల సంబంధం ఏమిటి?
జవాబు: భూమి పూజ గురించి చాలామందికి డౌట్లు ఉన్నాయి. చేయకపోతే ఏమవుతుంది అంటూ విమర్శిస్తుంటారు. ఏదైనా నిర్మాణం చేసేముందు కచ్చితంగా భూమి పూజ చేయాలని వాస్తు సిద్దాంతి కాశీనాథుని శ్రీనివాస్ అంటున్నారు. దాని వల్ల దోషాలు, చెడు ప్రభావం పోతాయి. కొందరు స్మశానాలను ప్లాట్లుగా చేసి అమ్ముతుంటారు.. కాబట్టి భూమి పూజ చేయడం మంచిది. దాని వల్ల చెడు ప్రభావం నిర్మాణంపై పడకుండా ఉంటుంది.
ప్రశ్న: దక్షిణం ఫేస్ బిల్డింగ్.. దాని ఎదురుగా రోడ్డు ఉంది. అయితే సెల్లార్లో వ్యాపారం చేసుకోవచ్చా..
జవాబు: సెల్లార్లో నిరభ్యంతరంగా వ్యాపారం చేసుకోవచ్చు. అయితే వర్షం పడినప్పుడు నీరు సెల్లార్లోకి చేరే అవకాశం ఉంటుంది. దాంతో వ్యాపార నిర్వహణకు ఇబ్బందులు కలుగుతాయి. వర్షపు నీరు చేరకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్లార్లోని కిచెన్, స్టోర్ రూమ్లు కూడా వాస్తు ప్రకారమే ఉండాలి.
ప్రశ్న: నార్త్ ఫేస్ కలిగి.. నివాసం ఉంటున్న బిల్డింగ్ ఎదుట మరో బిల్డింగ్ నిర్మించినప్పుడు.. ఆ రెండు బిల్డింగ్‌ల ద్వారాలు ఎదరెదురుగా ఉండవచచ్చా.. అలా ఉంటే ఏమైనా దోషమా..?
జవాబు: ఈ మధ్య చాలా పట్టణాల్లో బిల్డింగ్నిర్మాణాలు ఎదురెదురుగా.. ద్వారాలు వచ్చేవిధంగా కడుతున్నారు. ఇలా ఉండటం వలన ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే ప్రైవసీకి కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అలాంటప్పుడు కర్టెన్స్ వాడుకోవచ్చు. అంతేకాని.. కొంతమంది వాస్తు గురించి తెలియని వారు చెప్పే మాటలను పట్టించుకోవద్దని వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ చెబుతున్నారు.
ప్రశ్న: గతంలో ఉన్న డూప్లెక్స్ హౌజ్ ను సింగిల్ హౌజ్ గా మార్చుకోవచ్చా?
జవాబు : మార్చుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మొత్తం హౌజ్ ను కూల్చేస్తే ఆర్థిక భారం పెరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు హౌజ్ పడగొట్టకుండా చూసుకోండి. చిన్న చిన్న మార్పులు చేసుకొని సింగిల్ హౌజ్ గా మార్చుకోవచ్చు. స్లాబ్, బెడ్ రూమ్ లాంటి వాటిల్లో మార్పులు చేసుకుంటే ఇంటి స్పేస్ పెరుగుతుంది.. ఏమైనా సందేహాలు ఉంటే ఇంటి ప్లానింగ్ తీసుకొని వాస్తు నిపుణుడిని సంప్రదించాలని వాస్తు సిద్దాంతి కాశీనాథుని శ్రీనివాస్ సూచిస్తున్నారు.
-వెలుగు,లైఫ్–