
హైటెక్ యుగంలో జనాలు బిజీ లైఫ్ గడుపుతున్నారు. ఓపక్క బట్టలు ఉతుక్కుంటూనే.. మరో పక్క ఇంటిపనులు కూడా చేసుకుంటారు, అదేనండి వాషింగ్ మిషన్ లో బట్టలు వేసి మిగతా పనులు చేసుకుంటూ టైం వేస్ట్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే వాస్తు ప్రకారం ఇంట్లో బరువైన వాషింగ్ మిషన్ ఎక్కడ పెట్టాలి.. వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ గారి సలహాలను ఒకసారి తెలుసుకుందాం.
ప్రశ్న: బరువులు నైరుతి మూలనే ఉండాలంటారని పడకగదిలో నైరుతి మూలన బీరువా పెట్టాం..మరి వాషింగ్ మెషిన్ లాంటి బరువైన వస్తువులను ఎక్కడ పెట్టాలి? వాషింగ్ మిషన్ హాల్లో ఈశాన్యంలో ఉన్న బియ్యం బస్తాల పక్కనే ఉంటే వాస్తు ప్రకారం ఏమైనా దోషం ఉందా... అయితే ఇంటికి వచ్చిన ప్రతిఒక్కరూ హాల్లో ఎందుకుపెట్టారు. .. మంచిది కాదు... అంటున్నారు. బరువులను నైరుతిలో కాకుండా ఇంకెక్కడెక్కడ పెట్టొచ్చు?
జవాబు: బరువైన బీరువా, బియ్యం బస్తాలు వంటివి నైరుతి మూల పెట్టడమే మంచిది. ఎందుకంటే వాస్తు ప్రకారం అక్కడ బరువులు ఉండాలి. అయితే వాషింగ్ మెషిన్ కూడా బరువైన వస్తువే. కాబట్టి దాన్ని కూడా నైరుతిలో పెట్టాలి. హాల్లో నైరుతి మూలన పెట్టుకోవచ్చు. హాల్లో ఖాళీ లేదు అనుకుంటే.. దక్షిణ.. పడమర మధ్యలో పెట్టుకోవచ్చు. అప్పుడు ఎలాంటి వాస్తు దోషాలు ఉండవని వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ అంటున్నారు.