Vastu Tips : బ్యాచిలర్ రూంకి వాస్తు ఉంటదా.. ఫ్రెండ్స్ తో రూం తీసుకున్నా వాస్తు చూసుకోవాలా..?

Vastu Tips : బ్యాచిలర్ రూంకి వాస్తు ఉంటదా.. ఫ్రెండ్స్ తో రూం తీసుకున్నా వాస్తు చూసుకోవాలా..?

ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలో.. అది ఏదిశలో ఉండాలో వాస్తు శాస్త్రం చెబుతుంది.  అలా ఆ వస్తువు ఆ ప్రదేశంలో లేకపోతే.. మనకు తెలియకుండానే చాలా సమస్యలు ఎదుర్కొంటాం.   వాస్తు నిపుణులు తెలిపిన వివరాల ప్రకారంఇళ్లలో స్విమ్మింగ్​ పూల్ ఎక్కడ ఉండాలి.. . బ్యాచిలర్​ రూం వాస్తు ఎలా ఉండాలి.. పెళ్లి కాకపోవడానికి వాస్తుకు గల సంబంధం ఏమిటో తెలుసుకుందాం..

ప్రశ్న:  సిటీకి కొంత దూరంలో  ఉన్న స్థలంలో ఇల్లు.. అందులో స్విమ్మింగ్​ పూల్​ ఉన్నాయి.  అయితే చాలారోజుల కిందటే అన్ని రూములకు వాస్తు చూపించాను. కానీ స్విమ్మింగ్ పూల్​ కి  వాస్తు ఉంటుందని మొన్నీమధ్యే నా స్నేహితుడొకడు అన్నాడు. అసలు స్విమ్మింగ్ పూల్​ కి  వాస్తుతో సంబంధం ఉంటుందా? ఉంటే ఎక్కడ కడితే బాగుంటుంది

జవాబు :స్విమ్మింగ్ పూల్లో   ఉండేవి నీళ్లే కదా  కదా. కచ్చితంగా దానికి వాస్తుతో సంబంధం ఉంటుంది. నీళ్ల సంపు, బావి వంటివి ఎలా ఈశాన్యం మూల ఉండాలో.... స్విమ్మింగ్ ఫూల్ కూడా అక్కడే ఉండాలి. లేదా ఉత్తర దిక్కుకు మధ్యలో (నార్త్ సెంటర్) స్విమ్మింగ్హాల్, దాని పక్కగా ఈశాన్యం మూల సంపు ఉన్నా పర్వాలేదు. పూల్ వాలు మాత్రం పడమర నుంచి తూర్పుకు ఉండాలి. ఈమధ్య కొందరు స్విమ్మింగ్ ఫ్పూల్​ ను  ఇంటి పై ఫ్లోర్లలో పెట్టు కుంటున్నారు. అది మంచిది కాదు. దోషం చుట్టుకుంటుంది. అలాగే పూల్ లోతు ఇరవై ఫీట్లకు తక్కువగా ఉండకూడదు. పిల్లలకైతే ఆరు ఫీట్లు ఉన్నా సరిపోతుంది.

ప్రశ్న:  ఉద్యోగం చేస్తూ  హైదరాబాద్లో ఉంటున్నాను.  ప్రస్తుతం వయస్సు 32 సంవత్సరాలు.. ఇంట్లో ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కుదరట్లేదు. నలుగురు స్నేహితులం కలిసి రూమ్ తీసుకుని ఉంటున్నాం. నాకు పెళ్లి కుదరకపోవడానికి, మా రూమ్ వాస్తుకు ఏమైనా సంబంధం ఉందా?

జవాబు: పెళ్లి కావాలంటే ఇంటి వాస్తు ఒక్కటే చూస్తే సరిపోదు. అది వాళ్ల జాతకాన్ని బట్టి ఉంటుంది.  జన్మ నక్షత్రం చూస్తే పెళ్లి  ఘడియలు ఎప్పుడు ఉన్నాయో అంచనా వేసి చెప్పొచ్చు. అందులోనూ నలుగురు ఉండే బ్యాచిలర్ రూమ్ కాబట్టి. పెళ్లికి ఆ రూమ్ వాస్తుతో ఎలాంటి సంబంధం ఉండదు. పెళ్లి అనేది జ్యోతిష్యంతో ముడిపడి ఉంటుంది. మీరు జాతకం చూపించుకుంటే సరిపోతుంది. ఏవైనా దోషాలుంటే నివృత్తి చేసుకోవాలి. అప్పుడు అంతా మంచే జరుగుతుంది.

ప్రశ్న:  నా వయసు 63 ఏళ్లు. ..  నాకు ఏడుగురు పిల్లలు. అందులో ఇద్దరు కొడుకులు, అయిదుగురు ఆడబిడ్డలు. ఆరోగ్యశాఖలో ఉద్యోగం చేసి పదవీవిరమణ చేశాను. ఎవరికీ పెళ్లిళ్లు కాలేదు. అయితే ఏ ప్లాన్ లేకుండా 2012లో ఇల్లు కట్టాను. ఇంటికి మొత్తం ఆరు ద్వారాలున్నాయి. ప్రస్తుతం చాలా కష్టాలు పడుతున్నాను. ఇంటిని అమ్మేయాలా లేక మార్పులు చేస్తే సరిపోతుందా? మా ఇంటి వాస్తు చూసి పరిష్కారం చెప్పండి.

జవాబు:  మీరు కష్టాల్లో ఉండటానికి మీ ఇంటి  వాస్తు  కచ్చితంగా ఒక కారణమే.  మీ ఇంటికి మూడు రోడ్లు ఉన్నాయి.  అది అసలు కలిసిరాదు. అలాగే మీ ఇంటికి నైరుతిలో మోరీ ఉంది. దాని వల్ల ఎంత డబ్బు వచ్చినా నిలవదు. మగవాళ్లకి డబ్బు నష్టం. ఆడవాళ్లకు అనారోగ్య సమస్యలు తప్పవు. అయితే దక్షిణ వైపున్న ప్రహరీ గోడ నుంచి లోపలికి మూడు ఫీట్లు వదిలి ఒక గోడ లేదా ఫెన్సింగ్ కట్టుకోండి. 

 అయితే పెళ్లికి నూటికి నూరు శాతం వాస్తుతో పరిష్కారం దొరకదు. అందుకు పెళ్లి కాని పిల్లల జాతకాన్ని జ్యోతిష్యులకు చూపించండి. అలాగే దుర్గా దేవీ పూజ చేస్తే త్వరగా పెళ్లిళ్లు జరుగుతాయి. కానీ కుజ దోషం ఉంటే ఏమీ చేయలేం. దానికి మళ్లీ పూజ చేయాల్సి ఉంటుంది.

-వెలుగు,లైఫ్​‌‌–