
మీ చేతిలో డబ్బు నిలవడం లేదా? మంచి నీళ్లలా ఖర్చయిపోతుందా? ఏం చేసినా ఆదా కావడం లేదా? ఐతే అందుకు వాస్తు కూడా ఒక కారణమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వాస్తుకు, ఇంట్లో డబ్బు పెట్టుకొనే స్థలానికి సంబంధం ఉంటుందని వాస్తు పండితులు చెబుతున్నారు. . కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీ ఇంట్లో డబ్బు నిలుస్తుందని సూచిస్తున్నారు.వాస్తు శాస్త్రం ప్రకారం.. మీ ఇంట్లో ఉన్న శక్తులు.. మీ ధన ప్రవాహంపై ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే డబ్బును ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. మరి కరెన్సీ నోట్లను ఎక్కడ ఉంచాలి? ఏ దిశలో లాకర్ పెట్టాలి? డబ్బు దాచడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలను ఇక్కడ తెలుసుకుందాం
మనం ఎంత డబ్బులు సంపాదించిన ఖర్చులు ఎక్కువ కావడంతో డబ్బులు అయిపోతాయి.. ఇందుకు కారణం వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను పెట్టకుంటే తీవ్ర నష్టాన్ని చూడాలని నిపుణులు అంటున్నారు.. ఇంట్లోని ప్రతి వస్తువు ఎలా అమర్చుకోవాలి. ఎలాంటి వస్తువు ఏదిశలో ఉండాలి వంటి విషయాలను వాస్తు శాస్త్రం వివరిస్తుంది.. మనం డబ్బులను దాచుకొనే పెట్టేలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకుంటే హారతి కర్పూరంలా కరిగిపోతుంది..కొన్ని వస్తువులు తప్పకుండా పెట్టుకోవాలి. కొన్ని నెగెటివ్ వస్తువులు అల్మెరాలో పెట్టుకోవడం వల్ల ఆర్థికంగా నష్టపోతారు..
మీ ఇంట్లో మీ డబ్బుల లాకర్‌ను నైరుతి దిశలో పెట్టాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇక్కడ లాకర్ పెట్టడం వల్ల మీ ధనానికి స్థిరత్వం ఉంటుందని సూచిస్తున్నారు. అంతేకాదు మీ లాకర్ తలుపు పడమర దిశలో తెరుచుకోకూడదు. దాని వల్ల మీ ధనం బయటకు వెళ్లే అవకాశం ఉందట.
డబ్బు, కార్డులు తదితర డబ్బుకు సంబంధించిన వస్తువులను ఇంట్లో ఉత్తర దిక్కునే ఉంచాలట. ఉత్తర దిక్కు కుబేరుడికి చెందినదని శాస్త్రాలు చెబుతాయి. ఆయన ధనానికి దేవుడు. అందుకే ఇంట్లో ఉత్తర దిక్కున ఓ బాక్స్/బ్యాగు ఉంచి... అందులో డబ్బులు, కార్డులు ఉంచుకోవడం మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
డబ్బును ఇంట్లో ఏ మూలకో ఉంచడం సరికాదంటోంది వాస్తు శాస్త్రం. అలా ఉంచితే డబ్బు అక్కడ చిక్కుక్కున్నట్లు అర్థమట. ఒకవేళ ఏదో మూలకు పెట్టక తప్పని పరిస్థితి అయితే... ఉత్తర, తూర్పు మూలల్లో డబ్బు ఉంచొచ్చట.
మీ ఇంట్లో డబ్బుల డబ్బా... ఎప్పుడూ ఇంటి బయట నుంచి చూస్తే కనిపించకూడదట. అంతేకాదు ఏ డోర్‌కి కూడా ఎదురుగా ఉంచకూడదట. డబ్బులు ఉంచే పెట్టెలను ఏదైనా అల్మరాలోనో, అందరికీ కనిపించని చోటనో పెట్టడం మంచిదట. ఎవరికైనా మీ లాకర్ కనిపిస్తోంది అంటే... డబ్బు మీ చేజారిపోయే అవకాశం ఉందని అర్థమట.
క్యాష్ బాక్స్, లాకర్ ఎప్పడూ దక్షిణ దిక్కున పెట్టకూడదట. ఎందుకంటే లక్ష్మీదేవి ఇంట్లోకి దక్షిణ దిశ నుంచి వచ్చి... ఉత్తర దిక్కున కూర్చుంటుందట. అందుకే దక్షిణ దిక్కున డబ్బులు ఉంచొద్దని వాస్తు నిపుణులు చెబుతుంటారు. అలాగే బాత్‌రూమ్, కిచెన్, మెట్లు స్టోర్ రూమ్‌కి దగ్గరలో లాకర్‌లు ఉంచకూడదట
సాదారణంగా ముఖ్యమైన పత్రాలను, డబ్బులను బీరువాలో పెడుతుంటారు.. అయితే కేవలం ఇవి మాత్రమే లాకర్లలో పెట్టుకుంటే సమస్య ఉండదు. కానీ రకరకాల ఇతర వస్తువులను పెట్టినపుడు రకరకాల ప్రతికూల శక్తులు చేరే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా డబ్బు వచ్చే దారి మూసుకుంటుంది.
కొంత మంది బీరువాలకు అద్దాలను అమర్చుకుంటారు. కానీ ఇలా అమర్చుకోవడం మంచిదికాదు. వాస్తు ప్రకారం ఆర్థిక నష్టానికి కారణం అవుతుంది.
కొంతమంది ఫెర్ఫ్యూమ్స్ లను కూడా లాకర్స్ పెడుతుంటారు..ఫెర్ఫ్యూమ్స్ అల్మెరాలో పెడితే వాస్తు దోషాలు ఏర్పడతాయని పండితులు అంటున్నారు. అందుపవల్ల ఆర్థిక నష్టం కలుగుతుంది.
- ALSO READ | ఆన్ లైన్ మోసాలకు చెక్ పెట్టొచ్చిలా..
కొంతమంది డబ్బును వస్త్రంలో చుట్టి పెట్టుకోవడం అలవాటుగా ఉంటుంది. అలా డబ్బు చుట్టి పెట్టే వస్త్రం నల్లని రంగులో ఉండకూడదు. నల్లని వస్త్రంలో చుట్టి పెడితే డబ్బు త్వరగా ఖర్చయిపోతుంది.. అందుకే డబ్బులను ఎప్పుడు గుడ్డలో పెట్టకూడదు..
ఏదైనా చిరిగిన లేదా పనికి రాని కాగితాలను డబ్బుదాచుకునే బీరువాల్లో దాచకూడదు. వీటి వల్ల ప్రతి కూల శక్తి వేగంగా పెరుగుతుంది. ఫలితంగా ఇంట్లో ఆర్థిక నష్టాలు జరగవచ్చు. డబ్బుకు లోటు ఏర్పడుతుంది.. అందుకే డబ్బుల పెట్టేలో వీటిని అస్సలు పెట్టకండి.. లేదంటే తీవ్రమైన నష్టాలు చూస్తారని వాస్తు పండితులు అంటున్నారు..