Vastu Tips : ఈశాన్యం రోడ్డు పోటు స్థలాన్ని తీసుకోవచ్చా.. పూజ గదిలో అద్దం పెట్టాలా..?

Vastu Tips : ఈశాన్యం రోడ్డు పోటు స్థలాన్ని తీసుకోవచ్చా.. పూజ గదిలో అద్దం పెట్టాలా..?

ఇల్లు కట్టుకోవాలన్నా.. ఇంటి స్థలం కొనాలన్నా.. ఉన్న ఇంటిని రీమోడల్ చేయాలనుకున్నా.. తప్పని సరిగా వాస్తును పాటించాలి.  అయితే తరచుగా చాలమందిలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి.  సాధారణంగా వచ్చే ప్రశ్నలకు వాస్తుకన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ (9440088799)  సూచనలను ఒకసారి పరిశీలిద్దాం...

ఎలాంటి సైట్ కొనాలి..

ప్రశ్న:  తూర్పు వైపు ఉన్న ప్లాట్ కు . ..ఈశాన్యంలో పదిహేను అడుగుల రోడ్డుపోటు ఉంది. ప్లాటు వెడల్పు ఇరవై ఆరు అడుగులు. ఆ సైట్ తీసుకోవచ్చా?

జవాబు: తూర్పు ఈశాన్యం లేదా ఉత్తర ఈశాన్యం వైపు రోడ్డుపోటు ఉంటే మంచిది. దాని వల్ల ఎటువంటి ఇబ్బందులు రావు. ఆ ఇంట్లో సుఖసంతోషాలు ఉంటాయి. కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు. ఇతర ప్రాపర్టీస్ కొనే యోగ్యం కూడా కలుగుతుంది..

 పూజ గదిలో అద్దం పెట్టాలా? 

ప్రశ్న: చాలామందికి  ప్రతిరోజు పూజ చేయడం అలవాటు. పూజ కోసమే విడిగా గదిని కట్టుకున్నా. పూజగదిలో దేవుళ్లకు ఎదురుగా అద్దం ఉండాలని ఒక పూజారి చెప్పాడు. ఇది వాస్తవమేనా?

జవాబు: పూజగదిలో అద్దం ఉన్నా, లేకున్నా వచ్చే నష్టాలేవి లేవు. అది వ్యక్తిగత విషయం. అయితే దేవాలయాల్లో మాత్రం అద్దాలు ఉంటాయి.. ఎందుకంటే దేవుడి దర్శనం సరిగ్గా కానప్పుడు, అద్దంలో దేవుళ్ల విగ్రహాలు చూసి సంతృప్తి చెందుతుంటారు. భక్తులు. అందుకోసమే అద్దాలు వాడతారు తప్ప, కచ్చితంగా పూజ గదిలో అద్దం ఉండాలని ఏ శాస్త్రం చెప్పదు.

Also Read :- తేనెటీగ విషంతో గంటలో క్యాన్సర్ ఖతం !

ఇంటిని డూప్లెక్స్ గా మార్చుకోవాలనుకుంటే..?

ప్రశ్న:  పదిహేనేళ్లుగా ఒకే ఇంట్లో ఉంటున్న ఇంటికి మెట్లు పెట్టి డూప్లెక్స్ హౌజ్ గా  మార్చి అద్దెకు ఇవ్వాలనుకుంటున్న ఓనర్స్ కింద ఉండాలా? పైన ఉండాలా?
-

జవాబు: ఇంటిని డూప్లెక్స్ హౌజ్ మార్చుకోవచ్చు. కానీ, ఫేసింగ్ ని బట్టి కట్టుకోవాల్సి ఉంటుంది. డూప్లెక్స్ హౌజ్ ఏ దిశలో కట్టుకున్నా. నైరుతిలో మెట్లు ఉంటే మంచిది. వీలుకాకపోతే వాయువ్యం లేదా ఆగ్నేయంలో మెట్లు ఉండేలా చూసుకోండి. ఓనర్స్ ఏ పోర్షన్లోనైనా ఉండొచ్చు. దాని వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు.

అక్కడ స్టోర్ రూం ఓకేనా?

ప్రశ్న:  ఈ మధ్యనే మేము కొత్త ఇంట్లోకి మారాం. ఇంటి ఫేసింగ్ సౌత్ వైపు ఉంది. ఇంటి పక్కన కొంత ఖాళీ స్థలం పడమర వైపు ఉంది. అక్కడ స్టోర్ రూం ఏర్పాటు చేసుకోవచ్చా? 

జవాబు:  స్టోర్ రూం దక్షిణ నైరుతిలో ఉంటే మంచిది. పడమర వైపు ఖాళీ స్థలం ఉన్నా స్టోర్ రూం ఏర్పాటు చేసుకోవచ్చు. కాకపోతే స్టోర్ రూం ఇంటికి ఆనుకొని ఉండొద్దు. పడమర నైరుతిలో మాత్రమే స్టోర్ రూం ఏర్పాటు చేసుకోవాలి. . .

-కాశీనాథుని శ్రీనివాస్ (9440088799), వాస్తుకన్సల్టెంట్ -