ఇంటిని నిర్మించుకోవడం ప్రత ఒక్కరికి కల.. చిన్నదైనా.. లేదా అపార్ట్ మెంట్ లో ఏదైనా ప్లాట్ అయినా తీసుకోవాలనుకుంటారు. ఇల్లు కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. అమావాస్య రోజు ఎందుకు పనులు చేయకూడదు.. మొదలగు విషయాలపై వాస్తు సిద్దాంతి కాశీనాథుని శ్రీనివాస్( 94400 88799 ) చెబుతున్న సూచనలు, సలహాలను ఒకసారి పరిశీలిద్దాం. . .
లిఫ్టు ఉండొద్దా..
అపార్ట్మెంట్ లో ప్లాట్ను అనుకొని ఈశాన్యంలో లిఫ్టు ఉంది. అలా ఉండొచ్చా? ఎలాంటి మార్పులు చేసుకోవాలి?
ప్లాట్‌కు ఈశాన్యంలో లిఫ్ట్ ఉండటం మంచిది కాదు. దాని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. కుటుంబ సభ్యుల్లో మన: శాంతి ఉండదు. ఆర్థిక నష్టాలు కూడా ఉంటాయి. లిఫ్టు ఆగ్నేయం వైపు మాత్రమే ఉండాలి. మార్పులు చేయలేం కాబట్టి ఆ ఫ్లాటులో ఉండకపోవడం మంచిది. వెంటనే అమ్మేసి.. మరో ప్లాటులోకి మారడం బెటర్.
అమావాస్యనాడు పనులు చేయొద్దా!
ఒక హౌజ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను. చాలామంది కూలీలు, కార్పెంటర్లు అమావాస్య రోజు పనికి రావడం లేదు. ఆరోజు పనులు ఎందుకు మొదలు పెట్టకూడదు? దాని వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా?
అమావాస్య అంటేనే అశుభం. అందుకే ఆరోజు చాలామంది పనులు మొదలుపెట్టరు. కార్మికులు, కూలీలు కూడా పనులకు దూరంగా ఉంటారు. దాని వల్ల పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. కానీ చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ఆర్థిక సమస్యలు, అనారోగ్య ఇబ్బందులు ఉంటాయి. ఆ రోజు కొన్ని దుకాణాలు కూడా తెరుచుకోవు. అమావాస్య నాడు పనులు చేయకూడదనే సంప్రదాయం మన తాతల కాలం నుంచి ఉంది...
అక్కడ రోడ్డుపోటు ఉంటే..
ఇంటికి ఉత్తర భాగంలో ఆగ్నేయం వైపు రోడ్డుపోటు ఉంది. అలా ఉంటే సమస్యలు వస్తాయని ఒక పూజారి చెప్పాడు. దాంతో కాంపౌండ్ కట్టుకొని అక్కడ వినాయకుడి విగ్రహం పెట్టాం. ఇది సరైనదేనా?
రోడ్డుపోటు ఉంది కాబట్టి కాంపౌండ్ కట్టుకొని వినాయకుడి విగ్రహం పెట్టుకోవడం మంచిదే. ఇప్పుడున్న కాంపౌండ్ కు రెండు అడుగుల దూరంలో, సమాన ఎత్తులో మరో కాంపౌండ్ కానీ, ప్రహరీ కానీ కట్టుకుంటే బాగుంటుంది. దీని వల్ల తాతాల్కిక ఇబ్బందులు తొలగుతాయి
ఫంక్షన్ హాల్సు కూడా వాస్తు ఉంటదా?
నేను బిజినెస్ మాన్. సిటీ అవుట్ స్కర్ట్ లో ఫంక్షన్ హాల్ కట్టాలనుకుంటున్నా. మార్యేజ్ హాల్స్ లాంటి వాటికి కూడా వాస్తు ఉంటుందా? ఉంటే ఏ దిశల్లో ఏవేం ఉండాలి?
ఫంక్షన్ హాల్స్, కంపెనీలు, ఫ్యాక్టరీలు.. నిర్మాణం ఏదైనా కచ్చితంగా వాస్తు ప్రకారమే కట్టుకోవాలి. 'ఫంక్షన్ హాల్ కదా.. 'అని కొంతమంది. దిక్కులతో సంబంధం లేకుండా కట్టుకుంటారు. దాని వల్ల ఆర్థిక నష్టాలు వస్తాయి. కాబట్టి వాస్తు కన్సల్టెంట్ ను సంప్రదించి పని మొదలు పెడితే బాగుంటుంది.
–వెలుగు, లైఫ్–