హసన్ పర్తి, వెలుగు : ఎలాంటి రాజకీయాల జోక్యం లేకుండా మంచి అకాడమిక్, పరిశోధనలో నైపుణ్యం ఉన్నవారినే వీసీలను నియమించాలని తెలంగాణ స్టేట్ ఆల్ యూనివర్సిటీ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ మామిడాల ఇస్తారి అన్నారు. ఆదివారం యూనివర్సిటీల అధ్యాపకుల బృందం ఉన్నత విద్య ప్రిన్సిపాల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశాన్ని కలిసి వినతి పత్రం అందజేశారు.
అనంతరం మామిడాల ఇస్తారి మాట్లాడుతూ గతంలో జరిగిన వీసీల నియామకాలపై హైకోర్టులో కేసులు నడుస్తున్నాయన్నారు. అక్రమాలకు పాల్పడిన ఆయా యూనివర్సిటీల వీసీలపై విచారణ జరిపించాలని, వీసీలుగా దరఖాస్తు చేసుకున్న వారి ఐదేండ్ల ఆడిట్ రిపోర్టు పరిశీలించి, వారి అప్లికేషన్లను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.