
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీలో పని చేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బందికి ఈఎస్ఐ అమలుపరుస్తున్నట్లు వీసీ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం పాలమూరు యూనివర్సిటీలోని నాన్ టీచింగ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వీసీ శ్రీనివాస్‌ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యను విన్నవించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో పని చేస్తున్న ఉద్యోగులందరికీ ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తామని వీసీ చెప్పారు. త్వరలోనే వేతనాలు పెరుగుతాయని సిబ్బందికి హామీ ఇచ్చారు.
అనంతరం అధ్యక్షుడు రామ్మోహన్ మాట్లాడుతూ.. ఈఎస్ఐ కావాలని ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చామని ఆ హామీ నెరవేరలేదని ప్రస్తుత వీసీ శ్రీనివాస్, ఈఎస్ఐ అమలు చేయడం పట్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి రిజిస్టార్ మధుసూదన్ రెడ్డి, అధ్యక్షులు రామ్మోహన్ జి.పర్వతాలు రాగిణి, కోశాధికారి రాజేందర్, మధులిక, రామకృష్ణ, రాఘవేందర్ గౌడ్, చంద్రశేఖర్ సత్యం, స్రవంతి పాల్గొన్నారు.