తెలంగాణ వర్సిటీలో వీసీ వర్సెస్ ఈసీ

  • గత నెల19 నాటి మీటింగ్ నిర్ణయాలపై హైకోర్టు స్టే
  • 26 నాటి తీర్మానాల అమలుపై కన్ఫ్యూజన్​

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్​లోని తెలంగాణ యూనివర్సిటీ తాజా పరిణామాలు తీవ్ర గందరగోళం కలిగిస్తున్నాయి. వీసీ రవీందర్​గుప్తా వర్సెస్ ఈసీ మెంబర్ల మధ్య నడుస్తున్న వార్​కారణంగా పాలనాపరమైన అగాధం నెలకొంది. గత నెల19వ తేదీన నిర్వహించిన ఈసీ మీటింగులో తీసుకున్న నిర్ణయాలపై హైకోర్టు స్టే విధించగా, 26వ తేదీన జరిగిన తీర్మానాల అమలు కన్​ఫ్యూజన్​గా మారింది. ఉన్నత విద్యా శాఖ కమిషనర్ నవీన్​ మిట్టల్, కార్యదర్శి వాకాటి కరుణ నేతృత్వంలో 26న సమావేశమైన ఈసీ సభ్యులు వీసీగా రవీందర్​గుప్తా బాధ్యతలు తీసుకున్న తరువాత, ఈసీ ఆమోదం లేకుండా ఖర్చు చేసిన ప్రతి పైసాను ఏసీబీతో విచారణ చేయించాలని తీర్మానించి ఏసీబీ డీజీకి లేఖ రాశారు. రిజిస్ట్రార్​విద్యావర్థినిని సస్పెండ్ చేయాలని మినిట్స్ రాశారు. ఫైవ్​మెన్, త్రీమెన్ కమిటీ ఏర్పాటు, ఫర్నిచర్​కొనుగోలు కోసం పాటించాల్సిన నిబంధనల అంశాలపై తీర్మానించారు. ఇందులో కీలకమైన ఏసీబీ విచారణ, విద్యావర్థని సస్పెన్షన్ అంశాలపై ఏమి జరగబోతుందనే టెన్షన్ అందరిలో నెలకొంది. 


రిజిస్ట్రార్ యాదగిరిపై వీసీ సీరియస్​


19న ఈసీ మీటింగ్ తర్వాత రిజిస్ట్రార్​గా యాదగిరి చార్జ్​ తీసుకున్నారు. ఇది చెల్లదని వాదిస్తున్న వీసీ రవీందర్​గుప్తా హైకోర్టు స్టేను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ​.. రెండు రోజుల్లో ఆమోదయోగ్యమైన ఆర్డర్ తెచ్చుకోవాలని లేకుంటే పోలీసు కేసు నమోదు చేయిస్తానని అల్టిమేటం ఇచ్చారు. కోర్టు స్టేను గౌరవించి బాధ్యతల నుంచి తప్పుకునే ఆలోచనలో యాదగిరి ఉన్నారు.  ఈ విషయాన్ని సీరియస్​గా భావిస్తున్న నవీన్​మిట్టల్, వాకాటి కరుణ స్టే రద్దు కోసం ప్రయత్నిస్తున్నారు.  


ఈ నెల 5న వర్చువల్​ మీటింగ్?


వీసీ, ఈసీ మెంబర్ల కొట్లాటలో తన భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న విద్యావర్థిని తనకు రిజిస్ట్రార్ బాధ్యతలే వద్దని తెగేసి చెప్పారు. యాదగిరిని తప్పించి తిరిగి రిజిస్ట్రార్​ కుర్చీలో తనను కూర్చోబెట్టాలనే వీసీ రవీందర్ గుప్తా ఆలోచనను విద్యావర్థిని వ్యతిరేకిస్తున్నారు. ఈ నెల 5న నిర్వహించనున్న ఈసీ మెంబర్ల వర్చువల్ మీటింగ్​పై అనుమానాలు మొదలయ్యాయి. అనేక మలుపులు, ఉత్కంఠకు దారితీసిన పరిణామాలు చివరకు ఎటు వెళ్తాయనే ఆసక్తి వర్సిటీలో ఏర్పడింది.