దక్షిణాదికి ప్రత్యేక బడ్జెట్ ​కేటాయించాలి : వీసీకే రాష్ట్ర  అధ్యక్షుడు జిలుకర శ్రీనివాస్

దక్షిణాదికి ప్రత్యేక బడ్జెట్ ​కేటాయించాలి : వీసీకే రాష్ట్ర  అధ్యక్షుడు జిలుకర శ్రీనివాస్

ముషీరాబాద్, వెలుగు: పార్లమెంట్ ​నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని విముక్త చిరుతల కచ్చి(వీసీకే) రాష్ట్ర అధ్యక్షుడు జిలుకర శ్రీనివాస్ పేర్కొన్నారు.  కేంద్రం దక్షిణాదికి ప్రత్యేక బడ్జెట్​కేటాయించాలని డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్ బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘దక్షిణాది పార్లమెంట్​సీట్లు పెంపు.. దక్షిణాది హక్కు’ అంశంపై వీసీకే రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

వీసీకే తెలుగు రాష్ట్రాల ఇన్​చార్జ్​బాలసింగం, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, సీపీఎం రాష్ట్ర నేత నరసింహరావు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి రవి, బీఎల్​పీ రాష్ట్ర అధ్యక్షుడు నల్ల సూర్యప్రకాశ్, జిలుకర శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. బీజేపీ, ఆర్ఎస్ ఎస్ ‘హిందీ, హిందూ, హిందూస్థాన్’ అనే నినాదాన్ని అమలు చేస్తోందని ఆరోపించారు.  జనాభా నియంత్రణ, పార్లమెంట్​స్థానాల పెంపుతో దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్​ను దేశ రెండో రాజధాని చేయాలని డిమాండ్  చేశారు. ఉత్తర్​ప్రదేశ్ ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని కోరారు.