
వంగూర్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో ఈ నెల 6న నిర్వహించే సీతారాముల కల్యాణోత్సవం వాల్ పోస్టర్ ను సోమవారం సీఎం సోదరుడు, వీడీసీ చైర్మన్ ఎనుముల కృష్ణారెడ్డి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. మాజీ ఉప సర్పంచ్ ఎనుముల వేమారెడ్డి, పులిజాల కృష్ణారెడ్డి, వెంకటయ్యయాదవ్, అనిల్ పాల్గొన్నారు.