టీఎస్ to టీజీ... కొత్త వాహనాలకు మాత్రమే !

టీఎస్ to  టీజీ... కొత్త వాహనాలకు మాత్రమే !
  • 15వ తర్వాతే ఇలా రిజిస్ట్రేషన్లు
  • రేపు కేంద్ర రవాణాశాఖకు ఫైల్
  • గెజిట్ వచ్చాక 2 రోజుల్లో నోటిఫికేషన్

హైదరాబాద్: వెహికిల్ నంబర్లపై రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం అమల్లోకి రావడానికి ఇంకా 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం వాహనాల నంబర్లకు టీఎస్ అని ఉంది. దానిని టీజీగా మార్చుతూ నిన్న కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫైలును రేపు కేంద్ర రవాణాశాఖకు పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేంద్ర రవాణాశాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి వారం రోజులు పట్టే అవకాశం ఉంది.  అక్కడి నుంచి గెజిట్ వచ్చాక రెండు రోజుల తర్వాత నోటిఫికేషన్ వెలువడుతుంది.

ఇదంతా ప్రక్రియ పూర్తికావడగానికి 15వ తారీఖు వరకు టైం పట్టే అవకాశం ఉంది. అప్పుడు ఆర్టీఏ కార్యాలయాలకు ప్రభుత్వం ఉత్తర్వులు  జారీ చేస్తుంది. అప్పటి  నుంచి టీజీ అనేది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. 

కొత్త వాహనవాలకు మాత్రమే!

తెలంగాణ ఏర్పడిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిన వాహనాలకు టీఎస్ గా ఎలా చేశారో.. ప్రస్తుతం కేంద్ర రవాణాశాఖ గెజిట్ తర్వాత.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఆ తర్వాత కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వెహికిల్స్ కు మాత్రమే టీజీ పేరుతో నంబర్లను కేటాయిస్తారు.