రూ.లక్ష కోట్లతో వేదాంత అల్యూమినియం రిఫైనరీ

రూ.లక్ష కోట్లతో వేదాంత అల్యూమినియం రిఫైనరీ

న్యూఢిల్లీ: మైనింగ్​కంపెనీ వేదాంత ఒడిశాలోని రాయగడలో రూ.లక్ష కోట్ల పెట్టుబడితో 6 ఎంటీపీఏల అల్యూమినా రిఫైనరీ, 3 ఎంటీపీఏల గ్రీన్ అల్యూమినియం ప్లాంట్‌‌‌‌‌‌ను నిర్మించనున్నట్టు ప్రకటించింది. ఈ ప్రాజెక్టు మొదటి దశ రాబోయే మూడేళ్లలో ప్రారంభం కానుందని, తరువాత దీనిని విస్తరిస్తామని కంపెనీ చైర్మన్ అనిల్ అగర్వాల్ తెలిపారు. ఉత్కర్ష్ ఒడిశా, -మేక్ ఇన్ ఒడిశా  సమావేశం సందర్భంగా అగర్వాల్ మాట్లాడుతూ, “రాయగడ జిల్లాలో సంవత్సరానికి 6 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) సామర్థ్యం గల అల్యూమినియం శుద్ధి కర్మాగారాన్ని,  30 లక్షల టన్నుల సామర్థ్యం గల అల్యూమినియం స్మెల్టర్‌‌‌‌ను ఏర్పాటు చేస్తాం. రాయగఢలో మాకు బాక్సైట్ గని ఉంది. దీనిని  మరింత అభివృద్ధి చేస్తాం. వేదాంత గ్రూప్ ఇప్పటికే ఒడిశాలో గణనీయమైన పెట్టుబడులు పెట్టింది. వీటి విలువ రూ. లక్ష కోట్లకు పైగా ఉంది”అని అగర్వాల్ చెప్పారు.