గుజరాత్ లో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడితో సెమీకండక్టర్ల ప్లాంట్‌‌‌

గుజరాత్ లో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడితో సెమీకండక్టర్ల ప్లాంట్‌‌‌

న్యూఢిల్లీ:  దేశంలో అతిపెద్ద సెమీ కండక్టర్ల (చిప్ ల) ప్లాంట్ ను ఏర్పాటు చేయడానికి వేదాంత గ్రూప్ గుజరాత్ ను ఎంచుకున్నట్లు తెలిసింది. తైవాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీ ఫాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి వేదాంత గ్రూప్ ఓ జాయింట్ వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు  చేసింది. ఇది గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 20 బిలియన్ డాలర్ల (రూ.1,60,000 కోట్ల) పెట్టుబడితో సెమీకండక్టర్ల ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్మించనుందని  రాయిటర్స్ పేర్కొంది. వేదాంతకు గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి మూలధన ఖర్చులపై ఫైనాన్షియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నాన్ ఫైనాన్షియల్ రాయితీలు దొరికాయని,  తక్కువ రేటుకే ఎలక్ట్రిసిటీ దొరికిందని సంబంధిత వ్యక్తులుపేర్కొన్నారు.

ఈ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా వేదాంత–ఫాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాన్ జాయింట్ వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీ  డిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లే, సెమీకండక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సమీపంలో ఏర్పాటు చేస్తుందని వివరించారు. సెమీకండక్టర్ల ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెట్టడానికి గుజరాత్ ప్రభుత్వం నుంచి వెయ్యి ఎకరాలను ఫ్రీగా 99 ఏళ్ల లీజు కింద వేదాంత గ్రూప్ దక్కించుకుంది. వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎలక్ట్రిసిటీపై రాయితీలు పొందింది. ఈ విషయంపై వేదాంత స్పోక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ స్పందించలేదు.  వేదాంత–ఫాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాన్ జాయింట్ వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆకర్షించేందుకు  మహారాష్ట్ర, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలు కూడా  ప్రయత్నించాయి.