వేదాంత 3,324 కోట్ల డివిడెండ్ ​ప్రకటన

వేదాంత  3,324  కోట్ల డివిడెండ్ ​ప్రకటన

న్యూఢిల్లీ: వేదాంత లిమిటెడ్ 3,324 కోట్ల విలువైన డివిడెండ్​ ప్రకటించింది. ఒక్కో షేరుకు రూ. 8.5 చొప్పున 2025 ఆర్థిక సంవత్సరం కోసం నాలుగో మధ్యంతర డివిడెండ్‌‌ను చెల్లించనుంది. డివిడెండ్ అర్హత కోసం రికార్డు తేదీని డిసెంబర్ 24గా నిర్ణయించారు.  

వేదాంత లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డు సోమవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.    ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది నాలుగో మధ్యంతర డివిడెండ్. మే 2024లో రూ.11 చొప్పున, ఆగస్టు 2024లో రూ.4 చొప్పున, సెప్టెంబర్‌‌లో రూ.20 చొప్పున డివిడెండ్‌‌ను కంపెనీ ప్రకటించింది.