
న్యూఢిల్లీ: మైనింగ్ కంపెనీ వేదాంత బోర్డు మంగళవారం హిందుస్థాన్ జింక్‌లో 2.60 శాతం వాటాలను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయించడానికి ఆమోదం తెలిపింది. ఫ్లోర్ ధర, ఓఎఫ్ఎస్ తేదీ వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ఓఎఫ్ఎస్ ద్వారా 11,00,00,000 వరకు ఈక్విటీ షేర్ల విక్రయానికి ఆమోదం తెలిపింది. జూన్ క్వార్టర్ ముగిసే సమయానికి, హిందుస్థాన్ జింక్‌లో వేదాంతకు 64.92 శాతం వాటా ఉండగా, ప్రభుత్వానికి 29.54 శాతం వాటా ఉంది.
వేదాంత తన అల్యూమినియం, ఆయిల్ గ్యాస్, పవర్, బేస్ మెటల్స్, ఇనుము ఉక్కు వ్యాపారాలను ప్రత్యేక లిస్టెడ్ ఎంటిటీలుగా విడదీయాలని యోచిస్తోంది. రీఫైనాన్సింగ్ నష్టాలను, అప్పులను తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.