ప్రముఖులకు యాదాద్రి అర్చకుల వేదాశీర్వచనం

యాదగిరిగుట్ట, వెలుగు: న్యూఇయర్ సందర్భంగా సోమవారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, రాష్ట్ర షీప్స్&గోట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు కుటుంబ సభ్యులతో వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. 

అలాగే ఆలయ సాంప్రదాయం, ఆనవాయితీ ప్రకారం సోమవారం హైదరాబాద్ వెళ్లిన దేవస్థానం అర్చకులు, రాజ్​భవన్​లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్​కు, సెక్రటేరియట్​లో సీఎం రేవంత్ రెడ్డికి వేదాశీర్వచనం అందజేశారు. ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య సీఎం రేవంత్ కి లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు యాదగిరిగుట్టలోని ఇంట్లో యాదాద్రి అర్చకులు వేదాశీర్వచనం చేశారు.