కోటి దీపోత్సవంలో వేద మంత్రోచ్చరణ

ఎన్టీఆర్   కోటి దీపోత్సవం వైభవంగా సాగుతోంది. ఆరో రోజైన శుక్రవారం సాయంత్రం వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కార్తీక దీపాలు వెలిగించారు. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

– వెలుగు, ముషీరాబాద్