నాగోబా జాతరను వైభవంగా నిర్వహించాలని వెడ్మ బొజ్జు పటేల్‌‌‌‌ సూచన

గుడిహత్నూర్, వెలుగు: నాగోబా జాతరను వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌‌‌‌ సూచించారు. వచ్చే నెల 9న జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో కేస్లాపూర్‌‌‌‌లోని నాగోబా ఆలయ మురాడి పనులను మెస్రం వంశీయులతో కలసి ఎమ్మెల్యే ఆదివారం పరిశీలించారు. సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ఈ నెల చివరి వారంలో ఆదిలాబాద్‌‌‌‌కు వస్తున్న నేపథ్యంలో ఆలయ పనులను ఈనెల 20 వరకు పూర్తిచేయాలని ఆదేశించారు. 

నాగోబా జాతరకు శ్రీకారం

పుష్యమాసంలో వచ్చే అమావాస్యను పురస్కరించుకొని నిర్వహించే నాగోబా జాతరకు మెస్రం వంశీయులు శ్రీకారం చుట్టారు. శనివారం రాత్రి కేస్లాపూర్‌‌‌‌లోని నాగోబా మురాడి ఆలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాత్రి కనిపించిన నెలవంకకు మొక్కి నాగోబా మురాడి ఆలయంలో పూజలు చేశారు. నాగోబా ప్రారంభ మహాపూజ, జాతర నిర్వహణపై చర్చించారు.