జన్నారం, వెలుగు: సీఎం కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ వెడ్మ బొజ్జుపటేల్ ఓటర్లను కోరారు. మంగళవారం జన్నారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనపై ప్రజలు విసుగు చెందారని అన్నారు.
Also Read : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌దే అధికారం : ఆది శ్రీనివాస్
కాంగ్రెస్ కార్యకర్తలు ఐక్యంగా ఉండి పార్టీ విజయానికి కృషి చేయాలని, సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీ స్కీంలను ప్రజల్లోకి విసృతంగా తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మచ్చ శంకరయ్య, పార్టీ లీడర్లు సుభాష్ రెడ్డి, ముత్యం రాజన్న, రాజశేఖర్, సయ్యద్ ఫసిఉల్లా, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.