వీణవంక తహసీల్దార్ పై సస్పెన్షన్ వేటు

వీణవంక తహసీల్దార్ పై సస్పెన్షన్ వేటు

కరీంనగర్, వెలుగు : వీణవంక తహసీల్దార్ తిరుమల్ రావుపై సస్పెన్షన్ వేటుపడింది. తహసీల్దార్ ఆఫీ సులో గతంలో ధరణి ఆపరేటర్​గా పని చేసిన కె.అరుణ్ చౌదరి,  సుకాసి సురేశ్, నీల పూర్ణచందర్, మహ్మద్ అక్బర్ కుమ్మక్కై ఓ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్​ చేశారు. వీణవంక శివారులోని సర్వే నంబర్​ 1224/Aలో 6 గుంటలు, 1230/2/1లో 16 గుంటల భూమిని పట్టాదారు రామిడి శివప్రియ అమెరికాలో ఉండగానే ఆమె ఫొటోను ఫొటో తీసి, సంతకం వారే పెట్టి అక్రమాలకు పాల్పడ్డారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు తహసీల్దార్ తిరుమల రావును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు.