Veera Dheera Sooran Collection Day 1: వీర ధీర శూరన్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లు అంటే..?

Veera Dheera Sooran  Collection Day 1: వీర ధీర శూరన్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లు అంటే..?

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన  మూవీ ‘వీర ధీర శూరన్’ మూవీ గురువారం (మార్చి 27, 2025న) థియేటర్స్ లోకి వచ్చింది. ఈ సినిమాకి తమిళ్ డైరెక్టర్ ఎస్‌.యు.అరుణ్‌కుమార్‌ దర్శకత్వం వహించగా ప్రముఖ సినీ రియా శిబు నిర్మించారు. ఈ సినిమా టాలీవుడ్ లో NVR సినిమాస్, మైత్రి సంస్థలు రిలీజ్ చేశాయి. రిలీజ్ కి ముందు  టీజర్, ట్రైలర్ విజువల్స్ తో అంచనాలు పెంచిన వీర ధీర శూరన్ తర్వాత కూడా ఆమంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. 

ALSO READ | బాలీవుడ్ లో శ్రీలీలకి షాక్.. ఆ స్టార్ హీరోయిన్ కూతుర్ని తీసుకున్నారా.?

అయితే Sacnilk సమాచారం ప్రకారం మొదటి రోజు ఈ సినిమా అన్ని భాషల్లో దాదాపుగా రూ.3.25 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఒకప్పుడు విక్రమ్ కి ఉన్న మార్కెట్ తో పోలిస్తే ఈమధ్య కలెక్షన్స్ పరంగా చాలా తగ్గిందని చెప్పవచ్చు.  హీరో విక్రమ్ కి కొన్నేళ్లుగా సరైన హిట్ లేకపోవడంతో మార్కెట్ లేదు. కానీ వీర ధీర శూరన్ మాత్రం మంచి డీసెంట్ కలెక్షన్స్ సాధించింది. శని ఆదివారాలు సెలవులు ఉండటంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. 

ఈ విషయం ఇలా ఉండగా వీర ధీర శూరన్ సినిమాతోపాటూ రిలీజ్ అయిన ఎల్2: ఎంపురాన్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో విక్రమ్ సినిమాకి అన్ని భాషల్లో ఎల్2: ఎంపురాన్ గట్టి పోటీ ఇచ్చింది. దీంతో ఈ ప్రభావం వీర ధీర శూరన్ కలెక్షన్స్ పై పడినట్లు తెలుస్తోంది.