రంగరాజన్ పై దాడి కేసు..పోలీస్ కస్టడీకి వీర రాఘవరెడ్డి

రంగరాజన్ పై దాడి కేసు..పోలీస్ కస్టడీకి వీర రాఘవరెడ్డి

హైదరాబాద్: చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు  రంగరాజన్ పై దాడి చేసిన రామరాజ్యం వీర రాఘవరెడ్డిని  పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు మూ డు రోజులపాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి 18  నుంచి మూడు రోజుల పాటు పోలీసులు వీర రాఘవరెడ్డిని విచారించనున్నారు. పోలీసులు రిమాండ్ రిపోర్టులో వీర రాఘవరెడ్డి సంబంధించిన చాలా కీలక అంశాలు బయటపడ్డాయి.

ALSO READ | శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్పై వెళుతున్నారా..? ఇలాంటోళ్లు ఉంటారు.. జాగ్రత్త..!

 పోలీసుల దర్యాప్తులో వీర రాఘవరెడ్డి రామరాజ్యం పేరిట అనేక అక్రమ కార్యకలాపాలు చేసి న్నట్లు తెలుస్తోంది. ఇక పోలీసుల విచారణలో వీర రాఘవరెడ్డిపై 2015, 2016 లోనూ కేసులు ఉన్నట్లు వెల్లడైంది. గతంలోనూ వివిధ నేరాల్లో పాల్పడిన అతను, ఇప్పుడు చిలుకూరు రంగరాజన్ ను  ఉగాది వరకు సమయం ఇస్తున్నామని బెదిరించడం గమనర్హం. వీర రాఘవరెడ్డిని వెంటనే అరెస్టు చేయకపోతే లా అండ్ ఆర్డర్ కు  విఘాతం కలుగుతుందని పోలీసులు కోర్టుకు తెలిపారు. అతని మద్దతుదారులు ఎవరెవరు? అతను ఇప్ప టివరకు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డాడు? అనే అంశాలపై పోలీసులు లోతుగా విచారించే చాన్స్ ఉంది. 

చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ పై  గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. శుక్రవారం ( ఫిబ్రవరి 9, 2025 ) పలువురు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంటికి వెళ్లి దాడి చేశారు. అడ్డొచ్చిన ఆయన కుమారుడిపై కూడా దాడి చేశారు దుండగులు. దీనిపై చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవీ సౌందర్ రాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు  8 మందిని  అరెస్ట్ చేశారు