పానగల్, వెలుగు : మండలంలోని మందాపురం గ్రామంలో వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బండలాగుడు పోటీలను ప్రారంభించారు. పోటీల్లో గెలుపొందిన అఖిలేశ్రెడ్డి(నాగర్ కర్నూల్), కుందూరు భూపాల్ రెడ్డి(నంద్యాల), త్రిషా రెడ్డి(గుంటూరు), నాగయ్య(నంద్యాల), దొడిపాటి తిరుమలేశ్(నాగర్ కర్నూల్), గోపాలకృష్ణ(వనపర్తి), సుధాకర్ రెడ్డి(నాగర్ కర్నూల్)
రవి గౌడ్(నంద్యాల)కు నగదు బహుమతులు అందజేసి అభినందించారు. తెలంగాణ ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ చింతలపల్లి జగదీశ్వర్ రావు, కాంగ్రెస్ పార్టీ నేతలు విజయభాస్కర్ రెడ్డి, బుసిరెడ్డిపల్లి కృష్ణ, రోహిత్ సాగర్, రవి, మధుసూదన్ రెడ్డి, గోవర్ధన్ సాగర్, ముంత భాస్కర్, జయరాములు, రాములు, బ్రహ్మయ్య, పుల్లారావు, వాహీద్ పాల్గొన్నారు.