
కురవి, వెలుగు: మహబూబాబాద్ జిల్లా కురవిలో వెలసిన భద్రకాళి సమేత వీరభద్ర స్వామి రథోత్సవం వైభవంగా సాగింది. సోమవారం సాయంత్రం స్వామి వారి రథాన్ని హైదరాబాద్ కు చెందిన భక్తులు వివిధ రకాల పూలతో అలంకరించారు. అభిషేకం, నిత్యోపాసన, బలిహరణ, దిష్టి పూజ, వాస్తు పూజ నిర్వహించారు.
ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్, ఆలయ చైర్మన్ ఎర్ర నాగేశ్వరరావు, సోమిశెట్టి శ్రీనివాస్, వద్దుల సురేందర్ రెడ్డి, అంబటి వీరభద్రం స్వామి వారి రథాన్ని లాగారు. భక్తుల కోలాటాలు, నృత్యాలు, డప్పు చప్పుళ్లు, వాయిద్యాల మధ్య రథోత్సవం కొనసాగింది. మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు, రూరల్ సీఐ సర్వయ్య, ధర్మకర్తలు బాలగాని శ్రీనివాస్ గౌడ్, గణేశ్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.