
రాయికోడ్, వెలుగు : రాయికోడ్ లోని భద్రకాళి సామెత వీరభద్రేశ్వర స్వామి ఆలయ హుండీని సోమవారం ఎండోమెంట్ అధికారులు లెక్కించారు. అక్టోబర్ 22 నుంచి ఏప్రిల్ 22 వరకు రూ 3.48 లక్షలు వచ్చినట్లు ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శివరాజ్, ఈఓ మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సిర్గాపూరం మొగులప్ప, టెంపుల్ మాజీ చైర్మన్ నాట్కారి మానయ్య పాల్గొన్నారు.