ఏప్రిల్ 2న ఐలమ్మ భారీ ఫొటో ఆవిష్కరణ

ఏప్రిల్ 2న ఐలమ్మ భారీ ఫొటో ఆవిష్కరణ

బషీర్​బాగ్, వెలుగు: కోఠిలోని మహిళా విశ్వవిద్యాలయానికి ప్రభుత్వం వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టిన నేపథ్యంలో ఆ ధీర వనిత భారీ ఫొటోను వర్సిటీలోని దర్బార్​హాల్లో బుధవారం ఆవిష్కరిస్తున్నట్లు రెవల్యూషనరీ ఉమెన్ హెల్త్ ఆర్గనైజేషన్ (ఆర్ బ్ల్యూహెచ్ వో) అధ్యక్షుడు పి.హరికాంత్​ తెలిపారు. 

ఉపాధ్యక్షుడు కె.చరణ్, కార్యదర్శి డాక్టర్ సౌజన్యతో కలిసి మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సంబంధిత పోస్టర్ ఆవిష్కరించి, మాట్లాడారు. వర్సిటీ వీసీ సూర్యధనుంజయ, సినీ నిర్మాత, దర్శకుడు బి.నర్సింగరావు, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు చెప్పారు. విశ్వవిద్యాలయానికి ఐలమ్మ పేరు పెట్టినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.