నెట్‌వర్క్, వెలుగు : వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కరీంనగర్‌లో ప్రతిమ జంక్షన్‌లోని ఐలమ్మ విగ్రహానికి కలెక్టర్ గోపి పూలమాల వేసి నివాళులర్పించారు. బల్దియా హెడ్డాఫీసులో జరిగిన వేడుకల్లో మేయర్ సునీల్‌రావు ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
పోలీస్కమిషనరేట్లో సీపీ ఎల్.సుబ్బరాయుడు, అడిషనల్డీసీపీలు సి.రాజు, ఎ.లక్ష్మీనారాయణ నివాళులర్పించారు. వేర్వేరు కార్యక్రమాల్లో డిప్యూటీ కమిషనర్స్వరూపరాణి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, కార్పొరేటర్లు మాధవి, ఐలేందర్‌యాదవ్, చంద్రమౌళి పాల్గొన్నారు.
జగిత్యాలలో ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వేర్వేరుగా నివాళులర్పించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ భాస్కర్ఐలమ్మ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. మంథనిలోనూ బీజేపీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.