జగన్ సమక్షంలో వైసీపీలోకి సీనియర్ టీడీపీ నేత..

2024 సార్వత్రిక ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది, నామినేషన్లు దాఖలు చేయటానికి ఈరోజుతో గడువు ముగుస్తుండటంతో నేతలంతా ఆర్వో ఆఫీసులకు క్యూ కట్టారు. ఒక పక్క నామినేషన్లు, మరో పక్క ఎన్నికల ప్రచారంతో రాష్ట్రం హోరెత్తుతోంది. ఎన్నికల్లో సీటు ఆశించి దక్కని నేతలంతా పార్టీ ఫిరాయింపులు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. కడప జిల్లా సీనియర్ నాయకుడు వీరశివారెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. 

ఈ ఎన్నికల్లో కమలాపురం నుండి టికెట్ ఆశించగా మొండి చెయ్యి చూపింది పార్టీ అధిష్టానం. పైగా వీరశివారెడ్డి సోదరుడి కుమారుడు ప్రవీణ్ రెడ్డికి కూడా ప్రొద్దుటూరు టికెట్ ఇవ్వకపోవటంతో ఆయన పార్టీని వీడి వైసీపీలో చేరారు.పులివెందుల నామినేషన్ వేసిన జగన్ ను పార్టీ ఆఫీసులో కలిసి తన అనుచరులతో సహా జగన్ సమక్షంలో చేరారు వీరశివారెడ్డి. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కడప జిల్లాలో వైసీపీ పదికి పది సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరి, వీరశివారెడ్డి వైసీపీలో చేరటం కడప జిల్లా టీడీపీని ఏ మేరకు ప్రభావితం చేస్తుందో చూడాలి.

Also Read:పసుపు చీర కట్టుకుని.. కుట్రలో భాగమైన.. వీళ్లా వైఎ‍స్సార్‌ వారసులు