తండాలు పేరుకే గ్రామ పంచాయతీలు : వీర్లపల్లి శంకర్

తండాలు పేరుకే గ్రామ పంచాయతీలు :  వీర్లపల్లి శంకర్

పేరుకే గ్రామ పంచాయతీలు

షాద్ నగర్, వెలుగు : తండాలను పేరుకే గ్రామ పంచాయతీలుగా మార్చారు, కానీ అభివృద్ధి చేయడం మరిచారని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. ఆదివారం నందిగామ మండలం బండకుంట, పెద్ద కుంట తండాల్లో పర్యటించి... కాంగ్రెస్‌‌లో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన మహిళలకు ఉపాధి, యువతకు ఉద్యోగాలను ప్రభుత్వం కల్పించడం లేదని విమర్శించారు. ఏ తండాలో కూడా సంక్షేమం, అభివృద్ధి లేదని, రేషన్ కూడా సరిగా ఇవ్వడం లేదని వాపోయారు. తండాల దుస్థితి పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తండాల రూపు రేఖలను మారుస్తామన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.