వెజ్ పై 8 శాతం, నాన్ వెజ్ పై 12 శాతం తగ్గింపు

వెజ్ పై 8 శాతం, నాన్ వెజ్ పై 12 శాతం తగ్గింపు

న్యూఢిల్లీ: దేశంలో గత ఆగస్టు నెలలో భోజనం ధరలు దిగివచ్చాయి. వెజ్ 8 శాతం, నాన్ వెజ్ మీల్స్ పై 12 శాతం ధరలు తగ్గినట్టు క్రిసిల్ రేటింగ్ ఏజెన్సీ శుక్రవారం నివేదిక వెల్లడించింది. కాగా వెజ్ భోజనంలో వినియోగించే టమోట, ఉల్లిపాయలు, ఆలుగడ్డల ధరల తగ్గడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. 

ఇక నాన్ వెజ్ కి సంబంధించి చికెన్ ధరలు దిగిరావడమే కారణం. ఆగస్టులో రోటీ, పప్పు, కూర, రైస్, పెరుగు, సలాడ్ తో కూడిన భోజనం రూ. 34 ఉండగా.. ఇప్పుడు రూ. 31 కు తగ్గింది. అలాగే చికెన్ తో కూడిన నాన్ వెజ్ భోజనం ఆగస్టులో రూ. 67.5 ఉండగా ఇప్పుడు రూ. 59కి దిగివచ్చింది