జనం నాన్ వెజ్ కంటే ..వెజ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారట..సర్వేలు ఏం చెబుతున్నాయంటే..

జనం నాన్ వెజ్ కంటే ..వెజ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారట..సర్వేలు ఏం చెబుతున్నాయంటే..

ఒకప్పుడు వెజ్ కంటే నాన్ వెజ్ రేట్లు ఎక్కువగా ఉండేవి. ఒకప్పుడు వెజ్ మీల్స్ ధరలు అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. వెజ్ కంటే నాన్ వెజ్ రేట్లే తక్కువగా ఉన్నాయి. ఆహారం విషయంలో పబ్లిక్ ఇంట్రస్ట్ మారడమే దీనికి కారణమంటున్నారు ఎక్స్ పర్ట్స్. కరోనా తరువాత ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో శాఖాహారాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారట.

కరోనా తర్వాత ప్రజల లైఫ్ స్టైల్ మారింది. ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా నాన్ వెజ్ పై జనం అభిప్రాయం మారుతోంది. వెజిటేరి యన్ ఫుడ్ తీసుకోడానికి పబ్లిక్ ఇంట్రస్ట్ గా ఉండటంతో.. ఇప్పుడు మర్కెట్లో వెజ్ మీల్స్ రేట్లు పెరిగాయి.  

 క్రిసిల్ సర్వే లెక్కల ప్రకారం 2022 డిసెంబర్ నుంచి..ఈ ఏడాది ఏప్రిల్ వరకు చూస్తే వెజ్ ధరలు పెరిగాయి. గతంలో 70 నుంచి 80 రూపాయలు ఉన్న వెజ్ మిల్స్ ఇప్పుడు 180 రూపాయలకు చేరింది. నాన్ వెజ్ లో కొవ్వు పదార్దాలు ఎక్కువ ఉండడంతో వెజ్ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నాన్ వెజ్ తింటే డైజెస్ట్ అవ్వడనికి చాలా టైం పడడంతో..జనం వెజ్ తింటున్నారు.

శాఖాహారంలో అన్ని రకాల పోషకాలు లభించడంతో దానినే ప్రిఫర్ చేస్తున్నారు ప్రజలు. కూరగాయలతో పాటు నిత్యావసరాల ధరలు పెరగడం కూడా వెజ్ మీల్ ధరలు పెరగడానికి ఓ కారణమని చెబుతున్నారు హోటల్ నిర్వాహకులు. నాన్ వెజ్ ఎక్కువ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయనే ప్రచారంతో.. ఎంత ధర ఉన్నా వెజ్ మీల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు వినియోగదారులు.

వెజ్ కర్రీస్ ధరలు పెరగడంతో..పాత ధరకే క్వాంటిటీ తగ్గించి విక్రయిస్తున్నారని తెలిపారు కస్టమర్స్. వెజ్ మీల్స్ లో చాలా రకాల కర్రీస్ ఉండడంతో ధరలు ఎక్కు వ గా ఉన్నాయంటున్నారు హోటల్ నిర్వాహకులు. బాయిలర్ చికెన్ తింటే అనారోగ్య సమస్యలు వస్తాయన్న ప్రచారంతో..వెజ్ తింటున్నామని తెలిపారు వెజ్ కస్ట మర్స్.

శాఖాహారంలో అన్నిరకాల పోషకాలు లభించడంతో.. ధర ఎక్కువైనా తింటున్నామని తెలిపారు వెజ్ వినియోగదారులు. అయితే వెజ్ కంటే నాన్ వెజ్ రేట్లు తక్కువ ఉండటంతో.. తినడానికి ఇష్టపడుతున్నారు మరికొంతమంది ప్రజలు.