- లాక్ డౌన్ తర్వాత దిగొస్తున్న రేట్లు
- సిటిజన్స్‌కు తప్పిన వెజిట్రబుల్స్
హైదరాబాద్, వెలుగు: కూరగాయ ధరలు భారీగా తగ్గాయి. లాక్ డౌన్ కు ముందు మస్తు రేట్లున్నప్పటికీ ఆ తర్వాత ధరలు దిగొస్తున్నాయి. దీంతో సిటిజన్స్‌కు వెజిట్రబుల్స్ నుంచి రిలీఫ్ వచ్చింది. నెల రోజుల కింద కిలో టమాట రూ. 50 ఉంటే, ఇప్పుడు రూ. 8 కే వస్తోంది. అన్ని కూరగాయలు ధరలు బాగా తగ్గాయి. బెండకాయ, బీరకాయ, చిక్కుడు, బీన్స్ కిలో రూ. 40 లోపే దొరుకుతున్నాయి. వంకాయ, క్యాబేజీ, ఆలుగడ్డ, కాకర కాయ కిలో రూ. 20 లోపే ఉన్నాయి. లాక్ డౌన్ నుంచి కూరగాయల ధరలు తగ్గుతున్నప్పటికీ ఈ స్థాయిలో రేట్లు దిగిరావటం ఇదే తొలిసారి. దీంతో మిడిల్ క్లాస్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్లో కనీసం వెయ్యి రూపాయలు సేవ్ అవుతున్నాయంటున్నారు.
పెరిగిన దిగుబడి
కొన్ని రోజులుగా కూరగాయల దిగుబడి పెరిగిపోయింది. రంగారెడ్డి, మేడ్చల్, చేవెళ్ల, వికారాబాద్, శంకర్ పల్లి, సిద్దిపేట్, గజ్వేల్ ప్రాంతాల్లో వెజిటబుల్స్ ను ఎక్కువగా పండిస్తుండగా మార్కెట్ కు భారీగా వస్తున్నాయి. దీనికి తోడు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. డిమాండ్ కు మించి వెజిటెబుల్స్ రావడంతో ధరలను తగ్గించారు. సిటీలోని మెహిదీపట్నం, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, ఎల్లమ్మబండ, అల్వాల్, ఆర్‌కే పురం, కొత్తపేట, ఫలక్ నుమా, మేడిపల్లి, వనస్థలిపురం, మీర్‌పేట రైతు బజార్లలో కూరగాయల అమ్మకాలు పెరిగాయి. ఈ నెలఖారు వరకు కూరగాయల దిగుబడి ఇదే విధంగా ఉంటుందని…అప్పటి దాకా రేట్లు తక్కువగానే ఉంటాయని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు.
For More News..