గత ప్రభుత్వ పాలనలో ఇబ్బందులు పడ్డాం : వ్యాపారులు

గత ప్రభుత్వ పాలనలో ఇబ్బందులు పడ్డాం : వ్యాపారులు
  • సమస్యలు పరిష్కారించాలని చిరు వ్యాపారుల వినతి​ 
  • ఎమ్మెల్యే వివేక్​ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్న మున్సిపల్​ కమిషనర్

కోల్ బెల్ట్, వెలుగు: రామకృష్ణాపూర్​ రాజీవ్ ​చౌక్​ కూరగాయల మార్కెట్​లో షెడ్లు నిర్మించాలని కోరుతూ క్యాతనపల్లి మున్సిపల్​కమిషనర్​గద్దె రాజుకు కూరగాయల వ్యాపారులు కోరారు. మాజీ జడ్పీటీసీ, స్థానిక కాంగ్రెస్ నేత ఎండీ యాకుబ్​ అలీ ఆధ్వర్యంలో గురువారం కమిషనర్​ను కలిసి వినతిపత్రం అందజేశారు. పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మూడేండ్ల క్రితం టెంపరరీ షెడ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.5లక్షల ఫండ్స్ మంజూరయ్యాయని, కానీ అప్పటి బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యంతో షెడ్లు నిర్మించుకోలేదన్నారు. 

ఇటీవల మరో రూ.4.45లక్షల ఫండ్స్ సాంక్షన్​అయ్యాయని.. ఈ ఫండ్స్ ల్యాప్స్​ అయ్యేలోపు షెడ్లను నిర్మించాలని కోరారు. స్ట్రీట్ ​లైట్లు, తాగు నీటి సౌలత్​లు కల్పించాలని మాజీ జడ్పీటీసీ యాకుబ్​అలీ కోరారు. ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కమిషనర్ ​హామీ ఇచ్చారు. వ్యాపారులు పుల్లూరి సత్యనారాయణ, తాటిపెల్లి రమేశ్, లెంకిటి స్వరూప, లక్ష్మి, అనిత, గుండ అపర్ణ, భాగ్య, గంగమ్మ తదితరులు పాల్గొన్నారు.