కూరగాయలు మండి పోతున్నాయి.. ఏ రేంజ్ లో అంటే ఆకు కూరల ధరలు చూస్తే చాలు.. ఎందుకు అంటారా.. పాల కూర కేజీ 120 రూపాయలు అంట.. 120 రూపాయలా అని నోరెళ్లబెట్టొద్దు.. కొత్తిమీర కేజీ కట్ట 260 రూపాయలు అంట.. ఏంటీ అవాక్కయ్యారా.. ఇంకో షాకింగ్ చెప్పమంటారా.. పచ్చిమిర్చి కేజీ 180 రూపాయలు.. ఏంటీ ఈ ధరలు అని షాక్ అవుతున్నారా.. మీరు మార్కెట్ కు వెళ్లి కొంటే మిగతా కూరగాయల ధరలు కూడా తెలుస్తాయి.. అప్పుడు మరింత షాక్ అవుతారు.. అవును కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి.. ఎంతలా అంటే.. కేవలం 15 రోజుల్లోనే.. అంటే జూన్ నెల ఒకటో తేదీ తర్వాత నుంచి రాకెట్ లా దూసుకుపోతున్నాయి. కూరగాయ ఏదైనా వంద రూపాయలు అన్నట్లు సాగుతుంది..
దీంతో జనాలు కూరగాయలు కొనాలంటేనే వణుకుతున్నారు సామాన్య ప్రజలు. ధరల పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో వానలు బీభత్సం సృష్టించాయి. దీంతో పంటల ఎదుగుదల ఆలస్యమై, దిగుబడి తగ్గింది. పైగా పలు కూరగాయలపై మచ్చలు ఏర్పడుతున్నాయి. అలాగే ఇతర ప్రాంతాల నుంచి మార్కెట్లకు కూరగాయల రవాణా భారీగా నిలిచిపోయింది. మహారాష్ట్ర నుంచి వచ్చే టమాట రావడం లేదు. దీంతో వాటి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం కేజీ టమాట 60 రూపాయల పైనే పలుకుతోంది.
మరోవైపు మార్కెట్లకు ఆకుకూరలు రావడం లేదు. ప్రస్తుతం పాలకూర కేజీ 120 రూపాయలకు చేరింది. బీరకాయ, వంకాయ లాంటి కూరగాయలు కిలో వంద దాటాయి. క్యారెట్, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, వంకాయ ఇలా వేటి ధరలైనా మండిపోతున్నాయి. కిలో బీట్ రూట్ 80 కి పైగా ఉంది. పచ్చిమిర్చి ఏకంగా 180 కేజీ ధర పలుకుతోంది.
ఇక...కొత్తిమీర, పుదీన కేజీ 260 రూపాయల ధర పలుకుతోంది. వీటితో పాటు ఇతర కూరగాయలు దాదాపు కేజీ 80 పైనే పలుకుతున్నాయి. పెరిగిన ధరలు చూసి పచ్చడి మెతుకులే దిక్కంటున్నారు పబ్లిక్. కూరగాయల ధరలు భారీగా పెరగటంపై సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలీచాలనీ జీతాలు, కూలీలకు తోడు ఈ కూరగాయలు ధరలు పెరుగుదలతో ఇల్లు గడవటమే కష్టంగా మారిందని అంటున్నారు జనాలు. .
ధరలు ఇలా
- క్యాలీఫ్లవర్ కేజీ రూ. 120
- లెమన్ కేజీ రూ. 200
- బెండకాయ రూ. కేజీ100
- బీరకాయ రూ. కేజీ140
- క్యారెట్ కేజీ రూ. 100
- అలుగడ్డ కేజీ రూ. 60
- ఉల్లిగడ్డ కేజీ రూ. 60
- బీన్స్ కేజీ రూ. 260
- సోరకాయ కేజీ రూ. 75
- క్యాప్సికమ్ కేజీ రూ. 140
- క్యాబేజీ కేజీ రూ. 90
- బీట్ రూట్ కేజీ రూ. 250
- వెల్లుల్లి కేజీ రూ. 500
- అల్లం (ఎల్లిగడ్డ) రూ. 250