
- భక్తులకు తప్పిన ప్రమాదం
జైపూర్ (భీమారం), వెలుగు: భీమారం మండలంలోని బురుగుపల్లి గ్రామ సమీపంలో బుధవారం ప్రయాణికులతో వెళ్తున్న టాటా ఏస్ వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల వివరాల ప్రకారం.. మహాశివరాత్రి పండుగను పురస్కరించుని కన్నెపల్లి మండలంలోని కొత్తపల్లికి చెందిన 10 మంది భక్తులు భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం దైవ దర్శనానికి టాటా ఏస్‌లో బయళ్దేరారు.
బురుగుపల్లి సమీపంలో వాహనంలో పొగ రావడాన్ని గమనించి డ్రైవర్ అప్రమత్తమై పక్కకు ఆపగా అందరూ కిందకు దిగారు. కొద్దిసేపటికే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. వాహనం మొత్తం కాలిపోయింది. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.