
నయాగరా: కెనడాలోని నయాగరా జలపాతం రెయిన్బో బార్డర్ బ్రిడ్జి వద్ద ఓ వాహనం పేలడం కలకలం సృష్టించింది. అమెరికా వైపు నుంచి -కెనడా వంతెన వైపు బుధవారం వేగంగా వెళుతున్న ఓ వాహనం చెక్ పాయింట్ వద్ద ఢీకొని పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
పేలుడు అనుమానాస్పదంగా ఉండటంతో అలర్ట్ అయిన అధికారులు.. క్రాసింగ్ బార్డర్లను మూసివేశారు. ఈ విధ్వంసానికి గల కారణమేమిటో ఇంకా తేలలేదు. కాగా, టెర్రర్అటాక్కు సంబంధించిన సంకేతాలు ఏమీ కనిపించడం లేదని చెప్పిన అధికారులు, ఘటనపై విచారణ చేపడుతున్నారు.
Also Read :- ఏఐ రెగ్యులేషన్కి సెబీ తరహా మోడల్ ఉండాలి : సంజీవ్ సన్యాల్