కొత్తకోట, వెలుగు: పట్టణంలో మంగళవారం నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ. 4 లక్షల 50 వేలను పట్టుకున్నట్టు ఎస్ఐ మంజునాథ్ రెడ్డి తెలిపారు. కోడ్ ఆఫ్ కండక్ట్‌లో భాగంగా పట్టణంలో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.
ఈ క్రమంలో ఓ స్కూటీపై బ్యాగ్‌తో వచ్చిన వ్యక్తిని తనిఖీ చేశారు. అతను రూ. 4 లక్షల 50 వేలను తీసుకెళ్తున్నాడు. ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో ఆ నగదను సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.