టూవీల్లరు, కార్ల స్టిక్కర్లపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు. బండ్లపై ప్రెస్, అడ్వకేట్లు, ఆర్మీ ఇలా ఏ స్టిక్కర్ ఉన్నా ఫైన్లు వేస్తున్నారు. ఐడీకార్డులు ఉన్నా కూడా బండ్లపై స్టిక్కర్లు తీసేసి మరీ ఏడు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు. అయితే పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఐడీకార్డులు చూపించినా ఫైన్లు వేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. బండ్ల మీద స్టిక్కర్లు ఉంటే వచ్చిన ఇబ్బందేంటో చెప్పాలంటున్నారు. మొన్న జూబ్లీహిల్స్లో ఎమ్మెల్యే కారు యాక్సిడెంట్ కేసులో స్టిక్కర్ దుర్వినియోగంపై ఏం కేసు పెట్టారో స్పష్టం చేయాలంటున్నారు. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం బండ్లపై ఎలాంటి స్టిక్కర్లు ఉండొద్దని పోలీసులు చెబుతున్నారు. అయితే పోలీస్ వెహికల్తో పాటు ప్రభుత్వ వాహనాలపై ప్రభుత్వ వాహనం అని రాసి ఉంటుంది కదా.. మరి అలాంటి వెహికల్స్ పై ఇప్పటివరకు ఎన్ని ఫైన్లు వేశారని ప్రశ్నిస్తున్నారు వాహనదారులు. ఈ స్టిక్కర్స్ విషయంలో పోలీసులు కాస్త ఓవరాక్షన్ చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. పోలీసుల వ్యక్తిగత వాహనాలకు పోలీస్ నేమ్ బోర్డు లేదా స్టిక్కర్లు వాడుకోవడం లేదా అని ప్రశ్నిస్తున్నారు వాహనదారులు. నెంబర్ ప్లేట్ కనిపించకుండా ఏవైనా స్టిక్కర్లు అంటిస్తే చర్యలు తీసుకోవచ్చు కానీ.. బండ్లపై స్టిక్కర్లు ఉంటే వచ్చిన ఇబ్బందేంటని క్వశ్చన్ చేస్తున్నారు.
For More News..