లాక్‌డౌన్ ఎఫెక్ట్: రోడ్డెక్కితే బండి సీజ్

లాక్‌డౌన్ ఎఫెక్ట్: రోడ్డెక్కితే బండి సీజ్

కరోనా నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించారు. అయితే ప్రజలు మాత్రం లాక్‌డౌన్‌ను పట్టించుకోకుండా రోడ్లపై తిరుగుతున్నారు. తెలంగాణతోపాటు పలు రాష్ట్రాలలో లాక్‌డౌన్ ప్రకటించినప్పటికీ ప్రజలెవరూ పట్టించుకోవడం లేదు.  దాంతో లాక్‌డౌన్ ఉల్లంఘించే వారికి కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం తెలిపింది. రాష్ట్రాలు ఖచ్చితంగా లాక్‌డౌన్‌ను అమలుచేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దాంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. మధ్యాహ్నం నుంచి లాక్‌డౌన్ సీరియస్ అమలు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం కూడా తెలిపింది. రోడ్లపైకి వస్తున్న జనాలను పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు. ఆటోలను, క్యాబ్‌లను ఆపి మళ్లీ రావొద్దంటూ సూచిస్తున్నారు. వాహనాల నుంచి ప్రయాణికలను దించి.. డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారిపట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని చోట్ల వాహనదారులకు భారీ ఫైన్‌లు విధిస్తున్నారు. మరికొన్నిచోట్ల వాహనాలను సీజ్ కూడా చేస్తున్నారు. స్వచ్ఛందంగా లాక్‌డౌన్ పాటించాలని పోలీసులు కోరుతున్నారు. సీజ్ చేసిన వాహనాలను లాక్‌డౌన్ పూర్తయ్యే వరకు ఇవ్వమని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. రోడ్డు మీదకు ఎవరోచ్చినా  ప్రశిస్తామని ఆయన తెలిపారు. అత్యవసర పని ఉంటేనే బయటకు రావాలని ఆయన కోరారు. సాయంత్రం 7 నుంచి ఉదయం 6 వరకు షాపులు, పెట్రోల్ బంకులు అన్నీ మూతపడతాయని ఆయన తెలిపారు. ప్రజలందరూ తమ ఇంటి దగ్గర్లోని కిరాణా షాపు వరకే వెళ్లాలని.. రోడ్ల మీదకు అనవసరంగా రాకూడదని ఆయన అన్నారు. బైక్‌పై ఒకరికి, కారులో ఇద్దరికి మాత్రమే బయటకు వెళ్లే అనుమతినిస్తున్నట్లు ఆయన తెలిపారు.

For More News..

కరీంనగర్‌లో కరోనా తొలి పాజిటివ్ కేసు

లాక్‌డౌన్‌పై మోడీ కీలక వ్యాఖ్యలు

జిల్లాల వారీగా కరోనా పేషెంట్ల వివరాలివే

లాక్‌డౌన్‌కు సంబంధించి పూర్తి వివరాలు

జనతా కర్ఫ్యూ దేశమంతా సక్సెస్

263 మందితో ఢిల్లీ చేరిన ఇటలీ విమానం

తక్కువలో తక్కువ 20 కోట్ల మందికి సోకే అవకాశం