యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీగా గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మే 29వ తేదీ సోమవారం విజయనగరం నుంచి ముంబైకి కారులో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న క్రమంలో పక్క సమాచారంతో నిందితులను పట్టుకున్నారు భువనగిరి పోలీసులు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల వద్ద నుండి 120 కేజీల గంజాయి, మూడు మొబైల్ ఫోన్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఎస్ఓటీ పోలీసుల పక్క సమాచారంతో రామన్నపేట పోలీసులు వాహనల తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితులు దొరికారని భువనగిరి జోన్ డిసిపి రాజేష్ చంద్ర తెలిపారు.