
చౌటుప్పల్, వెలుగు : సంక్రాంతి పండుగ పూర్తి కావడం, శుక్రవారంతో స్కూళ్లకు సెలవులు కూడా ముగుస్తుండడంతో సొంతూళ్లకు వెళ్లిన వారంతా హైదరాబాద్‌కు పయనమయ్యారు. దీంతో ఏపీ నుంచి వస్తున్న వాహనాలతో విజయవాడ – హైదరాబాద్ హైవే రద్దీగా మారింది. భారీ సంఖ్యలో వస్తున్న వాహనాలతో పంతంగి టోల్‌గేట్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. టోల్‌గేట్ వద్ద మొత్తం 16 గేట్లు ఉండగా, హైదరాబాద్ వైపు 12 గేట్లను తెరిచి వాహనాలను పంపిస్తున్నారు. ఈ టోల్‌ప్లాజా నుంచి సాధారణంగా రోజుకు 20 వేల వాహనాలు వెళ్తుండగా, గురు, శుక్రవారాల్లో సుమారు 65 వేల వాహనాలు వెళ్లినట్లు సిబ్బంది తెలిపారు.